Health: పిల్లలకు పాలు పట్టలేకపోతున్నారా.. ఇలా చేసి చూడండి
Health: పుట్టిన పిల్లలకు దాదాపు ఏడాది వరకు తల్లి పాలు పట్టించాలని అంటుంటారు. అలాగైతేనే తల్లికి, బిడ్డకు మంచిదని చెప్తుంటారు పెద్దలు. ఇది నిజమే కానీ ఇప్పుడున్న జీవనశైలితో పోల్చుకుంటే అసలు చాలా మటుకు తల్లులకు పాలు రావడమే లేదు. దాంతో ఫార్ములా పాలు పట్టించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంకొందరికైతే.. పాలు పేరుకుపోయి గడ్డ కట్టి విపరీతంగా నొప్పి పెడుతుంది. అలాంటివారు ఏం చేయాలి? పాలను ఎప్పుడు పిండి తొలగించుకోవాలి? ఇలా చేస్తే మంచిదా కదా? వంటి అంశాలను తెలుసుకుందాం.
పంపింగ్
వర్క్ చేసే తల్లులకు ఎప్పటికప్పుడు పిల్లలకు పాలు పట్టడం సాధ్యం కాని పని. అలాగని వారికి ఫార్ములా పాలు పట్టించాల్సిన అవసరం లేదు. పంపింగ్ ప్రక్రియతో మీ బిడ్డకు మీ పాలే పట్టించవచ్చు. మార్కెట్‌లో హై క్వాలిటీ బ్రెస్ట్ పంపింగ్ పరికరాలు దొరుకుతున్నాయి. కాస్త ఖరీదు ఎక్కువైనా కూడా వాటినే కొనేందుకు యత్నించండి. లేదంటే బ్రెస్ట్ వద్ద ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.
ఎప్పుడు పంపింగ్ చేయాలి?
మీ పిల్లలు ఎప్పుడు పాలు తాగుతారో చూసుకుని ఆ సమయానికి ఒక అరగంట ముందు మీరు పంపింగ్ ప్రక్రియను పాటించాలి. ప్రతి 3 నుంచి 4 గంటలకోసారి పంపింగ్ ప్రక్రియను చేపడితే పాలల్లోని పోషకాలు పోకుండా ఉంటాయి. మీరు పంపింగ్ ప్రక్రియ మొదలుపెడితే మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఫుడ్ అస్సలు వద్దు. పోషకాహారం తీసుకోండి. అప్పుడే పాలు పడతాయి. ఎప్పటికప్పుడు నీళ్లు బాగా తాగుతూ ఉండండి. కొందరు మూత్రం వస్తుందని నీరు తాగకుండా ఉంటారు. అది చాలా డేంజర్ అని గుర్తుపెట్టుకోండి.