Hair Care: ఏ దువ్వెన వాడుతున్నారు?
జుట్టును (hair care) దువ్వుకునేటప్పుడు కేవలం కురులకు దువ్వెన తాకితే సరిపోదు. కుదుళ్లకు కూడా తగలాలి. అయితే మరీ గట్టిగా దువ్వేసారంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అందులోనూ ప్లాస్టిక్ దువ్వెనలతో దువ్వుకుంటే మాత్రం ఇంకా ప్రమాదకరం. అందుకే వేప చెక్కతో తయారుచేసిన దువ్వెలను వాడుతుండాలి. ఈ మధ్య చెక్క దువ్వెనలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. రకరకాల పేర్లు పెట్టి అమ్ముతున్నప్పటికీ వేప చెక్క దువ్వెనే బెస్ట్.
*చెక్క దువ్వెనలను వాడటం వల్ల తక్కువ స్టేటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అంటే దువ్వుకునేటప్పుడు జుట్టు సాగడం.. ముక్కలుగా అయిపోవడం వంటివి ఉండవు.
*మాడు దగ్గర దురదగా ఉంటే ఈ చెక్క దువ్వెనలు ఎంతో మేలు చేస్తాయి.
*దురదను తగ్గించడంతో పాటు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. (hair care)
*తలకు నూనె రాసుకునేటప్పుడు ఈ చెక్క దువ్వెనలతో దువ్వుకుంటే కుదుళ్ల దగ్గర నుంచి జుట్టు చివరి వరకు నూనె సమానంగా అంటుతుంది.
*జుట్టు పెరుగుదలకు మీకు ఏవైనా టిప్స్ ఫాలో అవుతుంటే ఈ చెక్క దువ్వెనతో దువ్వుకోవడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది.