Protein ఎక్కువ తీసుకుంటున్నారా.. జాగ్ర‌త్త‌

ప్రొటీన్.. (protein) మ‌న ఒంట్లో కండ‌రాలు, ఎముక‌లు, చ‌ర్మం ఇలా శ‌రీరానికి కావాల్సిన అతి కీల‌క‌మైనది. ప్రొటీన్ త‌క్కువైతే చ‌ర్మం, జుట్టు, కండ‌రాలు, ఎముక‌లు.. ఇలా అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అదే ఎక్కువైనా కూడా అంత‌కంటే పెద్ద స‌మ‌స్య‌లే చుట్టుముడ‌తాయి. అస‌లు ప్రొటీన్ ఎక్కువ‌గా తీసుకుంటే ఏమ‌వుతుందో చూద్దాం.

కిడ్నీల‌పై ఒత్తిడి (kidneys)

మానవ శరీరంలో కిడ్నీల ప‌నితీరు ఎంతో కీల‌క‌మైన‌ది. మన శరీరం కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు మూత్రపిండాల పని తీరు ఎంతో ముఖ్యం. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే మన శరీరంలోని ఇత‌ర అవ‌యవాలు స‌రిగ్గా ప‌నిచేయ‌వు. ముఖ్యంగా గుండె ప‌నితీరుపై బాగా ప్ర‌భావం చూపుతుంది. అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ అధిక ప్రొటీన్ అనేది హాని కలిగిస్తుంది. ఇక ముందు నుంచీ కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకే ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకునేటపుడు ఎంత మొత్తంలో తీసుకుంటున్నామో చూసుకోవడం చాలా అవసరం. ఈ విష‌యంలో వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

డీ హైడ్రేషన్ (Dehydration)

మన శరీరానికి హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. మన బాడీ కనుక డీహైడ్రేట్ అయితే చాలా కష్టం. అందుకోసమే ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉండే ఆహారాలు తీసుకోవడం వ‌ల్ల‌ అవి మూత్రం ద్వారా ఒంట్లో నీటి శాతాన్ని త‌గ్గించేస్తాయి. అప్పుడు విప‌రీతంగా దాహం వేస్తుంది. పోనీ త‌క్కువ నీరు తాగుదామా అంటే డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇది ఇంకా డేంజ‌ర్. అందుకే ప్రొటీన్ విప‌రీతంగా ఉండే ఆహారం ఎప్పుడూ తీసుకోకూడ‌దు. (protein)

జీర్ణ సమస్యలు (indigestion)

మనం ఆరోగ్యంగా ఉండేందుకు మనం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావడం చాలా అవసరం. అదే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే మనం ఏం తిన్న కానీ అది సరిగ్గా జీర్ణం కాదు. అప్పుడు మనం తీసుకున్న విటమిన్స్, ఖనిజాలు అనేవి మన శరీరానికి స‌రిగ్గా అంద‌వు. దీని వ‌ల్ల మనకు అనారోగ్య స‌మస్య‌లు వచ్చే ప్రమాదం ఉంది. అధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకున్నపుడు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన‌ సమస్యలు వస్తాయి. మ‌ల‌బ‌ద్ధ‌కం కూడా వ‌స్తుంది. అందుకే కావాల్సిన మోతాదులో ప్రొటీన్ తీసుకుంటూనే దానికి త‌గిన‌ట్లు ఫైబ‌ర్ (పీచు) ఎక్కువ‌గా ఆహారం తీసుకోవాలి.

ఎముకలు దెబ్బ‌తింటాయ్ (bone health)

అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా కాల్షియం ఎక్కువ‌గా పోతుంది. ఇలా డెయిలీ కాల్షియం నష్టం జరగడం ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప‌ట్టుకుంటే విరిగిపోయే స్టేజ్‌కి వెళ్లిపోతాయి. అందుకే అధిక ప్రొటీన్స్ ఉన్న ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. (protein)

ఎంత మోతాదులో ప్రొటీన్ ఉండాలి?

ఇది అంద‌రికీ ఒకేలా ఉండ‌దు. ఎవ‌రు ఎంత మోతాదులో ప్రొటీన్ తీసుకోవాలి అనేది త‌మ ఆరోగ్యం ఎలా ఉందో దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే వైద్యుల‌ను సంప్ర‌దించి వారు సూచించే ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలో వారే చెప్తారు.