Periods: పీరియడ్స్ ప్రతి నెలా రావడంలేదా? అయితే ఈ సమస్య ఉందేమో చూసుకోండి
Periods: రజస్వల అయిన ప్రతి ఆడపిల్లకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తుండాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారు. అయితే మారుతున్న జీవనశైలో.. ఉద్యోగాల్లో, చదువుల్లో పెరుగుతున్న ఒత్తిడి వల్లో ప్రతి నెలా సమయానికి పీరియడ్స్ రాకుండా ఉంటాయి. కొందరికైతే కొన్ని నెలల పాటు పీరియడ్స్ రావు కూడా. ఇలాంటి సమస్యలు ఉన్నట్లైతే.. వారికి అండాశయాల్లో సిస్ట్‌లు ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఒవేరియన్ సిస్ట్ అంటారు. ఈ ఒవేరియన్ సిస్ట్‌లు చాలా రకాలు ఉంటాయి.
చాలా మటుకు సిస్ట్‌లు పెద్ద ప్రమాదకరం ఏమీ కావు. కొన్ని క్యాన్సర్‌కు సంబంధించినవి కూడా అయ్యుంటాయి. ఒకవేళ ఒవేరియన్ సిస్ట్‌లు ఉన్నాయి అనిపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పెల్విస్ (కటి ప్రదేశం)లో తీవ్రంగా నొప్పి ఉండటం.
ఈ సిస్ట్‌ల వల్ల కొన్నిసార్లు వాంతులు కూడా అవుతుంటాయి. ఈ లక్షణం ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎక్కువ సార్లు మలవిసర్జకు వెళ్లాల్సి రావడం.. మూత్రం పోస్తుంటే ఆ భాగంలో కాస్త నొప్పిగా అసౌకర్యంగా అనిపించడం.. కూడా కారణాలే.
సాధారణంగా పీరియడ్స్ వచ్చినప్పుడు వచ్చే నొప్పి కంటే నొప్పి విపరీతంగా ఉండటం.
వీటిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఒకవేళ ఎలాంటి లక్షణాలు లేకుండా సక్రమంగా పీరియడ్స్ రాకపోయినా కూడా వైద్యులను సంప్రదించాల్సిందే.