Mayonnaise: దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
మయోనైజ్.. (mayonnaise) బర్డర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి ఈ పదార్థాన్ని ఎక్కువగా వాడుతుంటారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోజూ బయట తినలేని వారు ఏకంగా షాపుల నుంచి మయోనైజ్ డబ్బాలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ మయోనైజ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు ఆహార నిపుణులు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మయోనైజ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయట.
ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి మయోనైజ్ యాడ్ చేసి ఉన్న షవర్మా తిని ఫుడ్ పాయిజన్‌తో చనిపోయాడు. కేరళలోని టీకోయ్ ప్రాంతానికి చెందిన రాహుల్ అనే 24 ఏళ్ల యువకుడు ఈ నెల 20న స్థానికంగా అమ్ముతున్న షవర్మా కొనుక్కుని తిన్నాడు. అతనికి ఆ రాత్రి అంతా విపరీతమైన కడుపు నొప్పి వాంతులు అయ్యాయి. దాంతో కుటుంబీకులు అతన్ని కొట్టాయం జిల్లాలోని హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఎప్పటికప్పుడు రాహుల్‌ను పరీక్షిస్తున్నప్పటికీ అతని ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. చివరికి మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్ అవడం వల్ల అతను చనిపోయాడు. (mayonnaise)
రాహుల్ చనిపోవడానికి కారణం అతను తిన్న షవర్మా మాత్రమే కాదు.. అందులో వాడిన మయోనైజ్ కూడా. ఈ విషయాన్ని రాహుల్‌కు వైద్యం అందించిన డాక్టర్లు అతని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేసారు. దాంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ డిపార్ట్‌మెంట్ అధికారులు ఒక కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. షవర్మా షాపులు నడిపేవారే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారు కూడా తయారుచేసిన ఫుడ్ ఎన్నింటికి వండారో సమయం కూడా ప్యాకెట్‌పై ముద్రించాలని ఆదేశాలు జారీ చేసారు. లేదంటే రూ.5 లక్షల వరకు జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష తప్పదు అని హెచ్చరించారు.
మయోనైజ్ అంత ప్రమాదకరమా?
రాహుల్ కేసును బట్టి చూస్తే అతను తిన్న షవర్మాలో వాడిన పదార్థాలు ఎక్స్‌పైర్ అయిపోయినవి వాడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే కేరళలో స్థానికంగా తయారుచేసి అమ్ముతున్న మయోనైజ్‌ను వాడి తయారుచేస్తున్న ఆహార పదార్థాల వల్ల చాలా మంది చనిపోయారని కొచ్చికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. సాధారణంగా గుడ్డు, వెనిగర్, నూనెతో ట్రెడిషనల్ మయోనైజ్ తయారుచేస్తుంటారు. ఇది నెలల తరబడి పెట్టుకుని తినేది కాదని ఎప్పటికప్పుడు తయారుచేసుకుని తినాలని రాజీవ్ తెలిపారు. (mayonnaise)
ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మధ్యాహ్నం సమయంలో మయోనైజ్ తయారుచేసి దానిని ఫ్రిజ్‌లో పెట్టకుండా సాయంత్రం వచ్చిన కస్టమర్లకు వాటితో ఫుడ్ వండి అందించారంటే ఏరికోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే అవుతుందట. అయితే ప్రస్తుతానికి కేరళలో మయోనైజ్‌లో పచ్చి గుడ్లు వాడకూడదని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఎందుకంటే పచ్చి గుడ్డులో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ విషయం తెలీక రెండు మూడు రోజుల క్రితం తెచ్చిపెట్టిన పచ్చి గుడ్లతో మయోనైజ్ తయారుచేయడం దానిని రోజుల తరబడి వంటకాల్లో వాడటం వంటివి చేస్తున్నారు.
పరిష్కారం ఏంటి?
అసలు బయట ఆహారం తినకపోవడమే బెటర్ అంటున్నారు రాజీవ్. అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. అది కూడా శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో అయితే మరీ మంచిది. ఇక మాయోనైజ్ విషయానికొస్తే అది లేకుండా కూడా ఫుడ్ తినచ్చు. ఒకవేళ మయోనైజ్ ప్రియులు ఉంటే మాత్రం ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
*మీరు మార్కెట్‌లో కొన్న మయోనైజ్ అయినా ఇంట్లో తయారుచేసుకున్నదైనా సరే ఎప్పటికప్పుడు తినేయడం బెటర్.
*ఒకవేళ మిగిలితే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేసుకోండి. పొరపాటున ఫ్రిజ్‌లో పెట్టడం మర్చిపోతే దానిని వాడకపోవడమే మంచిది.
*మీరు మార్కెట్ నుంచి తెచ్చిన ఏ ఆహార పదార్థాలైనా సరే వాటిపై ఎక్స్‌పైరీ డేట్ చూడండి. (mayonnaise)