Health: రాత్రి భోజనంలో కేవలం పండ్లు తినచ్చా?
Health: కొందరు బరువు తగ్గాలని రాత్రి వేళల్లో తిండి మానేసి కేవలం పండ్లు మాత్రమే తింటుంటారు. ఇలా డిన్నర్‌లో కేవలం పండ్లు తినచ్చా? తింటే ఏమవుతుంది?
రాత్రి వేళల్లో మితంగా ఏదో ఒకటి తినాల్సిందే. అది మానేసి కేవలం పండ్లు తినడం మంచిది కాదు. ఇలా రాత్రి వేళల్లో కేవలం పండ్లు మాత్రమే తింటే శరీరానికి అందాల్సిన కొవ్వు, ప్రొటీన్ వంటి అత్యవసర పోషకాలు అందకుండా పోతాయి.
డిన్నర్‌లో చాలా తేలికపాటి ఆహారం ఉండేలా చూసుకోవాలి. కిచిడీ, చపాతీ పప్పు వంటివి తీసుకుంటే మంచిది.
వాటితో పాటు ఒక కప్పులో వివిధ రకాల పండ్లు తీసుకుంటే మంచిది.
త్వరగా డిన్నర్ చేసేయడం వల్ల పడుకునే ముందు కాస్త ఆకలి వేస్తుంటుంది. ఆ సమయంలో ఒక యాపిల్ పండో లేదా డ్రై ఫ్రూట్సో తీసుకుంటే మంచిది.