Crapsules: ప్రాణాలు కాపాడే మలవిసర్జన మాత్రలు
Crapsules: మనకు విరోచనాలు అవుతుంటే తగ్గడానికి మాత్రలు వేసుకుంటాం. కానీ మలవిసర్జనతో తయారు చేసిన మాత్రల గురించి ఎప్పుడైనా విన్నారా? అందుకే వీటికి క్రాప్‌స్యూల్స్ అని పేరు పెట్టారు. వింటేనే వాంతులు అయ్యేలా ఉన్నప్పటికీ.. ఈ మాత్రలే మనుషుల ప్రాణాలు కాపాడేది. ఈ మాత్రలను FMT అంటారు. అంటే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్. అంటే ఆరోగ్యంగా ఉన్నవారి మలవిసర్జనను సేకరించి తయారు చేసే మాత్రలు. ఈ మాత్రలు పార్కిన్‌సన్స్ వ్యాధి, క్యాన్సర్, ఇన్‌సోమ్నియా, ఇతర అలెర్జీలను కూడా తగ్గిస్తాయట. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ మాత్రలను తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ FMTని నేషనల్ హెల్త్ సర్వీస్ కూడా ఆమోదించింది. కాకపోతే క్లీనికల్ ట్రయల్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ట్రయల్స్ మొదలైతే తప్ప ఈ మాత్రలు మార్కెట్‌లోకి రావు.