Male Breast Cancer: మగవారికీ రొమ్ము క్యాన్సర్
Male Breast Cancer: రొమ్ము క్యాన్సర్ అనగానే ఆడవారికే వస్తుందనుకుంటారు. అది అపోహ. మగవారికీ ఈ రిస్క్ ఉంటుంది. అదేంటీ.. రొమ్ములు సహజంగా ఆడవారికే కదా ఉండేది అనే సందేహం రావచ్చు. కానీ ఇది రొమ్ముల సైజుని బట్టి వచ్చే రోగం కాదు. మగవారిలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
60 ఏళ్లు పైబడిన మగవాళ్లలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఉంటుంది
ఆల్రెడీ కుటుంబంలో మగవారికి రొమ్ము క్యాన్సర్ ఉంటే కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఛాతి వద్ద రేడియేషన్ ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకున్నట్లైతే కూడా వచ్చే అవకాశం ఉంది
కాలేయ సమస్య, అధికంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉన్నా ప్రమాదమే
ఊబకాయం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి
వృషణాల్లో (Testicles) సమస్య ఉన్నా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
అత్యధిక మద్యపానం కూడా రిస్కే
లక్షణాలు
రొమ్ము చుట్టూ ఏదన్నా గడ్డలా ఉంటే అది ప్రధాన లక్షణంగా భావించాలి
చనుమొనల నుంచి రక్తం, చీము కారుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
రొమ్ము, చనుమొల చుట్టూ గుంతలు పడినట్లుగా ఉండటం.. చర్మం రంగు మారడం.. దద్దుర్లు వచ్చినట్లుగా ఉన్నా అవి లక్షణాలే
లింఫ్ గ్రంథులు వాచి ఉంటే క్యాన్సర్ వ్యాపిస్తున్నట్లు అర్థం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒంట్లోని కొవ్వు కరిగించుకునే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రిస్క్ ఉండదు
మద్యం పూర్తిగా మానేస్తే బెటర్
కుటుంబంలో ఎవరికైనా ఆల్రెడీ వచ్చి ఉంటే టెస్ట్‌లు చేయించుకోవడం మంచిది
ఈస్ట్రోజన్ హార్మోన్‌కు సంబంధించిన చికిత్సలకు దూరంగా ఉంటే మంచిది