A2 Milk: ఏ పాలు మంచివి? అసలేంటీ A1 A2 పాలు?
A2 Milk: ఈరోజుల్లో స్వచ్ఛమైన ఆవు, గేదె పాలు దొరకాలంటే అదృష్టం ఉండాలి. పల్లెటూర్లలో దొరికే పాలల్లో కూడా కల్తీ ఉంటోందని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. పైగా సాధారణ పాలు కాకుండా ఏ2 పాలు తాగితే మంచిది అని వైద్యులు చెప్తున్నారు. అసలేంటీ ఏ1 ఏ2 పాలు?
ఏ1 పాలతో పోలిస్తే ఏ2 పాలు శ్రేష్టమైనవని చెప్తున్నారు. కానీ దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన ఏ2 పాలు అని జనాలను మోసం చేస్తున్న వారిపై FSSAI సంస్థ కొరడా ఝళిపిస్తోంది. ఏ1 పాలకు ఏ2 పాలకు తేడా ఏంటంటే.. అందులో ఉండే బీటా కేసీన్ అనే ప్రొటీన్. ఈ ప్రొటీన్ ఎంతో మంచిది. ఇది ఏ2 పాలల్లోనే దొరుకుతుంది అని చాలా మంది అంటున్నప్పటికీ ఇంకా స్పష్టమైన ప్రకటనలు రాలేదు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాల ఉత్పత్తి జరిగే దేశం భారత్. మన నుంచే 25 శాతం పాలు ఉత్పత్తి అవుతోంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా పాల ఉత్పత్తి అవుతోంది. పాల ఉత్పత్తి జాతీయ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) లో 5% వాటాను కలిగి ఉంది.
మన దేశంలో నాలుగు జంతువుల పాలకు మంచి డిమాండ్ ఉంది. ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు. గేదె పాలల్లో కొవ్వు, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆవు పాలల్లో గేదె పాలకంటే తక్కువ కొవ్వు ఉంటుంది. కాకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. మేక పాలు చనుబాలతో సమానం. బాలింతలకు పాలు రాకపోతే పిల్లలకు మేక పాలు తాపుతుంటారు. ఒక ఒంటె పాలు కేవలం గుజరాత్‌లోనే అమ్ముతారు. దీనిలో అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ ధర ఎక్కువ.
ఇక ఏ2 పాల విషయానికొస్తే దేశీ ఆవు, గేదెల నుంచి సేకరించే పాలను ఏ2 పాలు అంటారు. అయితే నిపుణులు ఏమంటున్నారంటే.. ఏ1, ఏ2 అని కాకుండా దగ్గరుండి నేరుగా గేదెలు లేదా ఆవుల నుంచి పాలు పిండించుకుని తెచ్చుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఒకవేళ ఆవు, గేదె పాలు వద్దు.. వేరే రకమైన పాలు తాగడం బెటర్ అనుకునేవారికి ఈ ఆప్షన్లు బెస్ట్.
కొబ్బరి పాలు : క్రీం ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉంటాయి
ఓట్ పాలు : ఆరోగ్యానికి మంచిది
బియ్యం పాలు : ఆవు పాలకన్నా కాస్త పల్చగా తియ్యగా ఉంటాయి
బాదం, జీడిపప్పు పాలు : కేలొరీలు ఉండవు. పోషకాలు ఎక్కువ
సోయా పాలు : గేదె, ఆవు పాలకన్నా శ్రేష్ఠమైనది.