Iron Kadhai: ఐరన్ కడాయిలో ఇవి వండకూడదా?
Hyderabad: ఐరన్ కడాయి (iron kadhai) ప్రతి వంటింట్లో ఉంటుంది. అందులో రకరకాల వంటలు చేస్తుంటారు. అయితే కొన్ని రకాల వంటలను ఐరన్ కడాయిలో వాడకూడదట. అవేంటో చూద్దాం.
టొమాటోలు (tomatoes)
టొమాటోలు సాధారణంగానే ఎసిడిక్‌గా ఉంటాయి. టొమాటోలతో ఐరన్ కడాయిలో (iron kadhai) ఏ వంట చేసినా రియాక్ట్ అవుతుంది. ఆ మెటల్ అంతా వంటలోకి వచ్చేస్తుంది. దాంతో తింటున్నప్పుడు ఐరన్ తింటున్న ఫీలింగ్ వస్తుంది.
కోడి గుడ్లు (eggs)
కోడి గుడ్లలో సల్ఫర్ ఉంటుంది. ఐరన్ కడాయిలో (iron kadhai) గుడ్లు వేస్తే సల్ఫర్ ఐరన్‌తో రియాక్ట్ అయ్యి గుడ్లను బూడిద రంగులోకి మార్చేస్తుంది. ఐరన్, సల్ఫర్ కలిసాయంటే కడాయి తుప్పు పట్టిపోతుంది.
చేపలు (fish)
చేపల్లో సాధారణంగా ఉండే యాసిడ్లు ఐరన్ కడాయిలో వేసినప్పుడు అంటుకుపోతాయి. గెరిటతో ఎంత కలిపినా కూడా ఐరన్ రుచే వస్తుంది కానీ చేప రుచి రాదు.
పాస్తా (pasta)
ఐరన్ కడాయిలో పాస్తా వండటం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా టొమాటోలు వేసి వండితే ఇందాక చెప్పినట్లు అందులోని యాసిడ్స్ ఐరన్‌తో రియాక్ట్ అయ్యి అనారోగ్య సమస్యలు తెస్తుంది.