Healthy Heart: వయసు పైబడుతున్నా గుండె పదిలంగా..!
Healthy Heart: వయసు పై బడే కొద్ది గుండె కండరాల్లో బలం తగ్గుతూ వస్తుంది. ఫలితంగా గుండె సమస్యలు ఒక్కొక్కటిగా పెరుగుతుంటాయి. వయసు పెరుగుతున్నప్పటికీ గుండె పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి?
కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, యోగా ఇలా ఏదో ఒకటి వారంలో ఐదు రోజుల పాటు చేయడం అలవాటు చేసుకోండి. ఇవేమీ చేయలేం రా బాబూ అనుకుంటే.. కనీసం వాకింగ్ చేయడం అన్నా అలవాటు చేసుకోండి. మీకు ఒకవేళ వాకింగ్, వ్యాయామం అలవాటు లేకపోతే నిదానంగా స్టార్ట్ చేసి నిడివిని పెంచుకుంటూ వెళ్లండి. అంతేకానీ అసలు శరీరానికి ఎలాంటి అలసటను ఇవ్వకుండా తిని కూర్చుంటే మాత్రం వయసు పెరిగే కొద్ది శరీరం మీరు చెప్పినట్లు వినదు. మీకు వ్యాయామం, వాకింగ్ విషయంలో ఏమన్నా సందేహాలు.. లేదా ఆల్రెడీ ఏవన్నా అనారోగ్య సమస్యలు ఉన్నట్లైతే వైద్యులను సంప్రదించడం మంచిది.
మీరు చేసే భోజనంలో పోషకాలు ఎక్కువగా ఉంటున్నాయా లేవా అనేది చూసుకోండి. కొంచమే తింటున్నా అది పోషకాలతో కూడుకున్న భోజనం అయితే బెస్ట్. తెల్ల బియ్యానికి బదులు దంపుడు బియ్యం, కీన్వా, ఓట్స్ బెస్ట్. గుడ్లు, చికెన్, చిక్కుడు వంటివి వారంలో మూడు సార్లైనా తింటూ ఉండండి. మాంసాహారం అలవాటు లేకపోతే మంచిదే. బయట తిండి గురించి అసలు ఆలోచనే రానివ్వకండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లు అని చెప్పుకుంటున్న వాళ్ల దగ్గరే మిగిలిపోయిన ఎక్స్పైర్ అయిపోయిన దరిద్రమైన సరుకులతో ఆహారాలు తయారుచేసి వాటిని స్టైలిష్ పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఆకలేసినప్పుడు బయటి నుంచి ఆర్డర్ పెట్టుకోవడం కంటే ఏదన్నా ఒక పండు తిని ఉండటం మంచిది.
మీ హైట్‌కి తగ్గట్టు వెయిట్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ప్రతి ఆరు నెలలకోసారి గుండె చెకప్ చేయించుకుంటూ ఉండండి. మద్యం, ధూమపానం అలవాట్లు ఉంటే మానుకోవడం బెటర్. ఎందుకంటే మీరు ఎంత బాగా తింటున్నా వ్యాయామం చేస్తున్నా ఈ రెండు వ్యసనాలు అలవాటు ఉంటే ఏమీ లాభం ఉండదు.