వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్!
వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా విస్తిరంచిన నెట్‌వర్క్.. గత కొంత కాలంగా వాట్సాప్ తన టెక్నాటజీని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తూ.. యూజర్ ఫ్రెండ్లీ మాధ్యమంగా పేరు తెచ్చుకుంటోంది. ఈక్రమంలోనే మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అదే ‘లాక్ చాట్’. అసలు ఈ లాక్ చాట్ ఏవిధంగా పనిచేస్తుంది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..
వ్యక్తిగత గోప్యత కోసమే ఇదంతా..
సాధారణంగా వాట్సాప్‌లో మనం అనేక మందితో నిత్యం చాటింగ్ చేస్తుంటాం. ముఖ్యమైన ఫైల్స్, వీడియోలు, ఫొటోలను పంపిస్తుంటాం. అయితే ఆయా అకౌంట్లకు ఎలాంటి లాకింగ్ సిస్టమ్ ఇప్పటి వరకు లేదు. ఎవరైన మన ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే.. చాటింగ్ వివరాలు అన్ని తెలిసిపోతాయి. దీని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈనేపథ్యంలో వాట్సాప్ సంస్థ కొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా దీనిని తీసుకొస్తున్నట్లు సమాచారం. లాక్ చాట్ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తుండగా.. దీంతో యూజర్లు తమ ప్రైవేట్ చాట్లకు లాక్ విధించుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే తమ వ్యక్తిగత చాట్లపై యూజర్లకు ఇకపై పూర్తి నియంత్రణ ఉండనుంది. వ్యక్తిగత గోప్యతతోపాటు, భద్రత మరింత పెరగనుందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రయోగాత్మకంగా ఇప్పటికే పరీక్షించిన ఇంజినీర్లు..
ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏవిధంగా పనిచేస్తుందంటే.. ఒకసారి వాట్సాప్ చాట్‌ను లాక్ చేస్తే.. కేవలం యూజర్ మాత్రమే ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌వార్డు ద్వారా దాన్ని ఓపెన్ చేయగలం. ఫలితంగా ఇతరులెవరూ లాక్ చేసిన చాట్‌ను తెరవడం సాధ్యపడదు. ఒకవేళ ఎవరైనా ఫోన్ తీసుకొని లాక్ చేసిన చాట్‌ను పాస్‌కోడ్ లేదా ఫింగర్‌ప్రింట్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తే.. ఆ చాట్ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది. అలాగే లాక్ చేసిన చాట్‌లో వచ్చిన ఫొటోలు, వీడియోలు నేరుగా డివైజ్ గ్యాలరీలో సేవ్ కావని ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే.. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. దీన్ని అధికారికంగా ఎప్పుడు ప్రవేశపెడతారనేది తెలియాల్సి ఉంది. దీంతోపాటు యూజర్ల టైపింగ్ ఎక్స్‌పీరియెన్స్ పెంచేలా అదనపు ఫార్మాటింగ్ ఆప్షన్లతో కూడిన ‘టెక్ట్స్ ఎడిటర్’ అనే ఫీచర్‌పైన కూడా వాట్సాప్ పనిచేస్తుందట. ఇక ఈ ఫీచర్లు అన్నీ వస్తే.. యూజర్లకు మరిన్ని సౌకర్యాలు ఒనగూరినట్లు అవుతుంది.