Tuberculosis Day: క్షయ వ్యాధి ఎందుకొస్తుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
Tuberculosis Day: నేడు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం. ఈ వ్యాధిని మొదట 1992 మార్చి 24న గుర్తించారు కాబట్టి ఇదే రోజున క్షయ వ్యాధి అవగాహనా దినోత్సవంగా నిర్వహిస్తారు. డా. రాబర్ట్ కోచ్ ఈ క్షయ వ్యాధిని కనుగొన్నారు. ఇందుకు గాను ఆయనకు 1905లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేసారు.
ఊపిరితిత్తులకే కాదు…
ఈ క్షయ అనేది ఒక అంటువ్యాధి. అందరూ కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అనుకుంటారు. కానీ చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయ వ్యాధి. మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల ఈ వ్యాధి వస్తుంది. కేవలం క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు దగ్గర తప్ప మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఏ భాగంలో వచ్చినా ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. (Tuberculosis Day)
క్షయ గురించి ఇవి తెలుసుకోవాల్సిందే..
*క్షయ సోకినప్పుడు ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అప్పుడే పుట్టిన పిల్లలు.. వయసు మీదపడుతున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
*లక్షణాలు వెంటనే తెలీవు కాబట్టి క్షయ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
*మీ ఇంట్లో వారికి కానీ లేదా మీరు పనిచేసే ప్రదేశంలో వారికి కానీ క్షయ వ్యాధి కానీ హెచ్ఐవి కానీ ఉంటే వెంటనే మీరు పరీక్షలు చేయించుకోవాల్సిందే.
*క్షయ వ్యాధి ఉన్నవారు దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు కచ్చితంగా ఖర్చీఫ్ అడ్డుపెట్టుకోవాల్సిందే. వీరు బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో వారి మధ్య తిరుగుతున్నప్పుడు మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి.