Viral News: బెయిల్‌పై బయటికొచ్చి.. మరో విద్యార్ధి ద్వారా గర్భం దాల్చి..!
Viral News: పిల్లల్ని లొంగదీసుకుని వారి ద్వారా లైంగిక వాంఛలు తీర్చుకుంటోందన్న కేసులో నిందితురాలిగా ఉన్న ఓ టీచర్.. బెయిల్‌పై బయటికి వచ్చి మరో టీనేజ్ పిల్లాడి ద్వారా గర్భం దాల్చింది. మాంచెస్టర్‌కు చెందిన రెబెకా అనే 30 ఏళ్ల మహిళ చిన్న పిల్లల ద్వారా లైంగిక వాంఛలు తీర్చుకుంటోందని ఆమెను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఖరీదైన వస్తువులు కొనిచ్చి తన ఫ్లాట్ తీసుకెళ్లి మరీ ఈ అఘాయిత్యాలకు పాల్పడింది.
ఈ కేసు ఇంకా నడుస్తుండగా ఆమెకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా రెబెకాకు బుద్ధిరాలేదు. మరో కుర్రాడిని వల్లో వేసుకుంది. దాంతో ఇప్పుడు ఆమె గర్భం దాల్చింది. పైగా ఆ కుర్రాడు రెబెకా విద్యార్ధే కావడం షాకింగ్ విషయం. పైగా ఆ కుర్రాడితో తాను అసలు గర్భం దాల్చే పరిస్థితి లేదని.. తనకు పీసీఓడి సమస్య ఉందని నమ్మబలికింది. ఆ తర్వాత తాను గర్భం దాల్చినట్లు తనతో చెప్పిందని ఆ యువకుడు కోర్టుకు తెలిపాడు. దాంతో ఇంకా ఈ కేసుపై వాదనలు జరుగుతున్నాయి. రెబెకా గురించి తెలిసిన వారు ఆమెకు మరణ శిక్ష విధించడం కరెక్ట్ అంటూ డిమాండ్ చేస్తున్నారు.