ప్ర‌భాస్, హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్

prabhas hanu raghavapudi film titled as fauji

Prabhas: రెబెల్ స్టార్ ప్ర‌భాస్.. సీతారామం ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి (Hanu Raghavapudi) కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌లార్ పార్ట్ 2తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న రాజా డీల‌క్స్ సినిమాతో పాటు స్పిరిట్, క‌ల్కి 2898 ఏడి సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ గ్యాప్‌లో హ‌ను రాఘ‌వ‌పూడి ప్ర‌భాస్ కోసం ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేసారు. ఈ స్క్రిప్ట్ ప్ర‌భాస్‌కి కూడా న‌చ్చ‌డంతో ఆయ‌న ఓకే అన్నారు. అలా హ‌ను రాఘ‌వపూడి ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. రెండో ప్ర‌పంచ యుద్ధం.. ఆ స‌మ‌యంలో చిగురించిన ప్రేమ క‌థ అనే కాన్సెప్ట్‌తో హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమా క‌థ‌ను రాసారు. చూడ‌బోతే ఇది మ‌రో సీతారామం అయ్యేలా ఉందని టాక్. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. దీనిని కూడా అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు.