Ustaad Bhagat Singh: మన జోలికొస్తే బ్రదరూ…

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(pawan kalyan), డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్(ustaad bhagat singh) పోస్ట‌ర్ రిలీజ్ అయింది. వెన‌క జ‌నం చూస్తుండ‌గా.. పోలీస్ బ్యారికేడ్‌పై చెయ్యి పెట్టి ప‌వ‌న్ స్టైల్‌గా నిల్చున్న పోస్ట‌ర్‌తో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ వ‌చ్చేస్తున్నాయ్‌. హ‌రీష్ కూడా ప‌వ‌న్ ఫ్యాన్ కావ‌డంతో.. ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఫ్యాన్స్ ఖుష్ అవుతారో తెలిసిన వ్య‌క్తి కాబ‌ట్టి సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్ ఈరోజు సంధ్య థియేట‌ర్‌లో సాయంత్రం రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు హ‌రీష్ ప్ర‌క‌టించారు.