NTR Birthday: మూడు స‌ర్‌ప్రైజ్‌లు.. ఫ్యాన్స్‌కి పండ‌గే!

three surprises on jr ntr birthday

NTR Birthday: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే వ‌చ్చేస్తోంది. ఈనెల 20న తార‌క్ త‌న 41వ పుట్టిన‌రోజును జ‌రుపుకోనున్నారు. తారక్ బ‌ర్త్‌డే అంటే ఫ్యాన్స్‌కి పూన‌కాలే. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కూడా చేసేసారు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న వార్ 2 (WAR 2) సినిమాలో హృతిక్ రోష‌న్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. షూటింగ్ కూడా మొద‌లైపోయింది. అస‌లే ప్యాన్ ఇండియ‌న్ స్టార్.. తొలి బాలీవుడ్ సినిమా.. మ‌రి బ‌ర్త్‌డేకి స‌ర్‌ప్రైజ్ ఉండ‌క‌పోతే ఎలా?

సాధార‌ణంగా బాలీవుడ్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు హీరో, హీరోయిన్ల పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా పోస్ట‌ర్లు రిలీజ్ చేయ‌డం వంటివి త‌క్కువ‌గా ఫాలో అవుతుంటారు. ఏదో ఒక మంచి ఫోటో పెట్టి బ‌ర్త్‌డే విషెస్ తెలిపి వ‌దిలేస్తుంటారు. కానీ మ‌న టాలీవుడ్‌లో అలా కాదు క‌దా. హీరో, హీరోయిన్ బ‌ర్త్‌డే వ‌స్తోందంటే.. వారు న‌టిస్తున్న సినిమాల్లోని పోస్ట‌ర్లు రిలీజ్ చేయాల్సిందే. ఇప్పుడు తార‌క్ విష‌యంలోనూ ఇదే జ‌ర‌గ‌బోతోంది. అయాన్ ముఖ‌ర్జీ తార‌క్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఒక మంచి పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌.

మొత్తానికి తార‌క్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మూడు స‌ర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఒక‌టి వార్ 2 పోస్టర్ అప్డేట్ అయితే మ‌రొక‌రి.. ఆయ‌న తెలుగులో న‌టిస్తున్న దేవ‌ర (Devara) సినిమాలోని ఓ కొత్త పోస్ట‌ర్ రిలీజ్ కాబోతోంద‌ని టాక్. ఇక మూడో స‌ర్‌ప్రైజ్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్‌తో చేయ‌బోయే సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్. మొత్తానికి యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌కి పండ‌గే..!