Atlee న‌న్ను మోసం చేసారు.. న‌టి సంచ‌ల‌న కామెంట్స్

Atlee: ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీపై షాకింగ్ కామెంట్స్ చేసారు న‌టి, మోడ‌ల్ సాక్షి అగ‌ర్వాల్ (sakshi agarwal). 2013లో అట్లీ తీసిన రాజా రాణి (raja rani) సినిమా ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో జై, న‌య‌న‌తార‌, ఆర్య‌, న‌జ్రియా న‌జీమ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

అయితే ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసమ‌ని సాక్షి అగ‌ర్వాల్‌ని ఎంపిక చేసుకున్నార‌ట‌. ఒక రోజు షూటింగ్‌లో పాల్గొన్నాక ఆ త‌ర్వాత నిర్మాత‌ల నుంచి కానీ షూటింగ్ సెట్ నుంచి కానీ సాక్షికి ఎలాంటి కాల్స్ రాలేద‌ట‌. ఆమె కాల్స్ చేసినా ఎవ్వ‌రూ స్పందించ‌లేదట‌. ఒక నెల త‌ర్వాత చూస్తే రాజా రాణి షూటింగ్ పూర్త‌యిపోవ‌డం ఆ త‌ర్వాత సినిమా రిలీజ్ అయిపోవ‌డం కూడా జ‌రిగిపోయాయి. (atlee)

స‌రేలే అనుకుని సినిమాలో తాను న‌టించిన సీన్లు ఎలా వ‌చ్చాయో తెలుసుకుందామ‌ని సినిమా చూస్తే త‌న‌కు షాకింగ్ ఘ‌ట‌న ఎదురైందని తెలిపారు. ఆ సినిమాలో తాను న‌టించిన ఒక్క సీన్ కూడా లేద‌ట‌. దాంతో ఎవ‌రిని అడ‌గాలో తెలీక నేరుగా అట్లీ ద‌గ్గ‌రికే వెళ్లి ఈ విష‌యం గురించి చ‌ర్చించార‌ట‌. అట్లీ త‌ప్పందా త‌న‌దే అన్న‌ట్లు మాట్లాడ‌టంతో ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని.. ఈ విష‌యంలో అట్లీ త‌న‌ను మోసం చేసాడ‌ని వాపోయింది సాక్షి. (atlee)

“” రాజా రాణి సినిమాలో న‌న్ను సెకండ్ లీడ్ అని చెప్పారు. ఆర్య ప‌క్కన న‌టించే ఛాన్స్ ఇస్తాం అన్నారు. నేను ఎంతో సంతోషించాను. ఒక రోజు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాను. ఆ త‌ర్వాత నాకు మిగ‌తా షూటింగ్ కోసం ఎవ్వ‌రూ పిల‌వలేదు. నాకు ఎవ్వ‌రితోనూ ప‌రిచయాలు కూడా లేవు. వారికి ఫోన్లు చేసి విసిగిపోయాను. నేను అప్ప‌టికి ద‌ర్శ‌కుడు అట్లీతో స‌రిగ్గా మాట్లాడింది కూడా లేదు. కొన్ని రోజుల త‌ర్వాత రాజా రాణి షూటింగ్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయింది. తీరా చూస్తే అందులో నాకు సంబంధించి ఒక్క సీన్ కూడా లేదు. ఎంతో బాధ‌ప‌డ్డాను. బ‌యటి నుంచి వ‌చ్చాన‌ని నాకు ఎలాంటి అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. నాకు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌ల‌తో కాంటాక్ట్స్ కూడా లేవు. ఒక్క మాట‌లో చెప్పాలంటే అట్లీ స‌ర్ న‌న్ను మోసం చేసార‌నే చెప్పాలి “” అని బాధ‌ప‌డ్డారు సాక్షి.