Hanuman: రామాయ‌ణం త‌ర్వాత‌ హ‌నుమంతుడు ఏమైపోయిన‌ట్లు?

Hanuman: రావ‌ణాసురుడు సీతమ్మ‌ను ఎత్తుక‌పోవ‌డం ఆ తర్వాత హ‌నుమంతుడి సాయంతో రాముడు రావ‌ణాసురుడిని వ‌ధించి సీత‌ను కాపాడుకోవ‌డం వ‌ర‌కు మ‌న‌కు తెలిసిందే. రామాయ‌ణం అంటే ఈ క‌థ‌ను మాత్ర‌మే చెప్తారు. అయితే రామయ్య రావ‌ణుడిని ఓడించాక తిరిగి అయోధ్య‌కు వెళ్లిపోయి ఉంటారు. మ‌రి హ‌నుమంతుడు ఏమైపోయిన‌ట్లు? రామాయ‌ణం త‌ర్వాత ఆంజ‌నేయుడు ఎక్క‌డికి వెళ్లాడు? ఏమైపోయాడు? వంటి అంశాలు పెద్ద‌గా ఎవ్వ‌రికీ తెలీవు. అయితే పురాణాల ప్ర‌కారం హ‌నుమంతుడు ఏమైపోయి ఉంటారు అనే దానిపై నాలుగు క‌థ‌లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. (hanuman)

రావ‌ణుడిని ఓడించిన త‌ర్వాత రామ‌య్య సీత‌మ్మ‌, హ‌నుమ‌తో క‌లిసి అయోధ్య వెళ్లారు. అక్క‌డ వారికి బ్ర‌హ్మాండంగా స‌న్మానం జ‌రిగింది. ఆ త‌ర్వాత రామ‌య్య వైకుంఠానికి వెళ్లిపోవాల‌నుకున్నారు. వెళ్ల‌డానికి ముందు రాముడు హ‌నుమ‌తో ఒక మాట చెప్పారు. తాను ఈ లోకంలో ఉన్నా లేక‌పోయినా హ‌నుమంతుడు మాత్రం ఇక్క‌డే ఉండి భ‌క్తుల‌ను ధ‌ర్మ మార్గాల్లో న‌డిపించాల‌ని చెప్పి చిరంజీవిగా వ‌ర్ధిల్ల‌మ‌ని దీవించి వెళ్లిపోతాడు.

మ‌రో క‌థేంటంటే.. ద్రౌప‌ది భీముడిని ఒక పువ్వు కావాల‌ని కోరింద‌ట‌. ఆ పువ్వు కోసం భీముడు అడ‌వుల్లోకి వెళ్లాడ‌ట. ఆ స‌మయంలో ఓ కోతి భీముడి దారికి అడ్డుప‌డింది. దాంతో భీముడు నీ తోక అడ్డుగా ఉంది ప‌క్క‌కు తియ్యి అని బెదిరించాడు. అప్పుడు ఆ కోతి నువ్వే నా తోక‌ను ప‌ట్టుకుని లేపు అప్పుడు త‌ప్పుకుంటాను అంద‌ట. అప్పుడు భీముడు త‌న‌కున్న బ‌లంతో వేలితో లేపేద్దాం అనుకుంటాడు. తీరా చూస్తే రెండు చేతుల‌తో త‌నకున్న బ‌లాన్నంతా ఉప‌యోగించినా దానిని లేప‌లేక‌పోతాడు. అప్పుడు భీముడికి అర్థ‌మ‌వుతుంది తాను గొడ‌వ‌పెట్టుకున్నది సాధార‌ణ కోతితో కాదు సాక్షాత్తు హ‌నుమంతుడితో అని. (hanuman)

మూడో క‌థేంటంటే.. హ‌నుమంతుడు హిమాల‌యాల్లో ఉన్నార‌ట‌. అక్క‌డే రామ జపం చేసుకుంటూ నివ‌సిస్తున్న‌ట్లు పురాణాలు చెప్తున్నాయి. క‌ల్కి అవ‌తారం ఎత్తిన‌ప్పుడు త‌న రామ‌య్య‌ను తాను క‌లుసుకోవాల‌ని హ‌నుమంతుడు హియాల‌యాల్లో ఎదురుచూస్తున్నాడ‌ట‌.

మ‌హాభార‌తంలో యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో అర్జునుడు, కృష్ణుడు త‌మ‌కు సాయంగా నిల‌వాల‌ని ఆంజ‌నేయుడిని అడిగార‌ట‌. ఇందుకు ఆయ‌న ఒప్పుకోవ‌డంతో అర్జునుడి ర‌థంలోని జెండాలో హ‌నుమంతుడు కొలువై ఉన్న‌ట్లు మ‌రో పురాణ క‌థ చెప్తోంది. (hanuman)