Manisha Koirala: లైఫ్ పార్ట్నర్ ఉండుంటే ఎంత బాగుండో
Hyderabad: తన జీవితంలో ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే ఎంత బాగుండోనని ఫీలవుతున్నారు నటి మనీషా కోయిరాలా (manisha koirala). 2010లో మనీషా నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 2012లో విడిపోయారు. అదే సంవత్సరంలో మనీషా ఓవేరియన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఆమె జీవితంలో మరెవ్వరినీ పెళ్లి చేసుకోలేదు. అయితే అప్పుడప్పుడూ తనకు లైఫ్ పార్ట్నర్ ఉంటే ఎంతో బాగుండో అని అనిపిస్తూ ఉంటుందని మనీషా అన్నారు. (manisha koirala).
” ఇప్పుడు ఫ్యామిలీ కావాలనుకోవడం చాలా కష్టం. నాకు పిల్లలు లేరు. కానీ ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. నేను పెంచుకుంటున్న పిల్లి, కుక్కలు నా పిల్లలు. అవే నా ప్రపంచం. అప్పుడుప్పుడూ అనిపిస్తుంటుంది ఓ బిడ్డను దత్తత తీసుకుంటే బాగుంటుంది అని. కానీ ఓ బిడ్డను పెంచడానికి నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నాలో వస్తుందో అప్పుడు తప్పకుండా ఓ బేబీని దత్తత తీసుకుంటాను. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. కానీ లైఫ్ పార్ట్నర్ మాత్రమే లేరు. ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది“ అని తెలిపారు మనీషా. (manisha koirala).