Jagapathi Babu: గుంటూరు కారం న‌చ్చ‌లేదు

Jagapathi Babu: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో త‌న పాత్ర అస్స‌లు న‌చ్చ‌లేద‌ని అన్నారు విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు. స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) బావ‌మ‌రిది ఆయుష్ శ‌ర్మ (Ayush Sharma) న‌టించిన రుస్లాన్ సినిమాలో జ‌గ్గూ భాయ్ కీ రోల్‌లో న‌టించారు. ఈ సినిమా గురించి త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తూ గుంటూరు కారంలో త‌న పాత్ర గురించి చెప్పారు.

“” నేను రుస్లాన్‌లో న‌టించ‌డానికి కార‌ణం స‌ల్మానే. ఇక్క‌డ చిన్న పాత్ర‌లున్న సినిమాలు చేస్తే మ‌ళ్లీ అలాంటి పాత్రల్లోనే న‌టించాల్సి వ‌స్తుందేమో అని భ‌య‌ప‌డ్డాను. కానీ సల్మాన్ న‌న్ను న‌మ్ము అని చెప్పిన‌ప్పుడు సినిమాకు ఓకే చెప్పాను. నేను ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టించాను. కానీ గుంటూరు కారంలో నేను చేసిన మార్క్స్ పాత్ర నాకు సంతృప్తిని ఇవ్వ‌లేదు. శ్రీమంతుడులో నాది మంచి పాత్ర‌. నాది మ‌హేష్ బాబుది ప‌వ‌ర్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఆ కాంబినేష‌న్‌ను గుం టూరు సినిమా లాంటి చెత్త పాత్ర‌తో వేస్ట్ చేసుకున్నాను. ఇక ముందు అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాను “” అని తెలిపారు.