Jabardast: డైరెక్టర్‌తో గొడవ.. అనసూయ రియాక్షన్
Hyderabad: యాంకర్‌గా, నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్(anasuya). ఈ మధ్యకాలంలో కొందరు నెటిజన్లు చేసే అసభ్యకరమైన కామెంట్ల కారణంగా ఆమె వివాదాల్లో నిలిచారు. ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడం మానేసి ఎవరికీ ఎలాంటి రిప్లైలు ఇవ్వడంలేదు. ఇటీవల రిలీజై మంచి హిట్ అందుకున్న రంగమార్తాండలో అనసూయ చక్కటి క్యారెక్టర్లో నటించారు. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్‌తో సరదాగా చిట్‌చాట్ చేసారు. ఆ కబుర్లేంటో చూద్దాం.
ఏంటి అనసూయ గారూ ఈ మధ్య నెగిటివ్ కామెంట్స్‌కు రిప్లై ఇవ్వడంలేదు?
వదిలేసానండీ. ప్రతిసారీ నేను సర్దిచెప్పలేను. వాళ్లే తెలుసుకుంటారు
ఓ డైరెక్టర్‌తో గొడవ అవ్వడం వల్ల జబర్దస్త్ మానేసారు అని అంటున్నారు. నిజమేనా?
కాదండి.
రంగమార్తాండలో అత్తమామల నుంచి మీకు ఎదురైన ఇబ్బందులు మీ జీవితంలో ఎదురయ్యాయా?
అయ్యాయి. ఇది ఎవరి ఇంట్లో అయినా జరుగుతుంది. నాకు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్లకు కూడా ఉంటుంది. ఓపిక పడితే అన్నీ అవే సర్దుకుంటాయ్.
సినిమా ఫీల్డ్‌లో మీకు ఎవరి మీదైనా కోపం ఉందా?
కోపం లేదు కానీ కొందరు అప్రోచ్ అయ్యే విధానం నాకు అస్సలు నచ్చదు. అలాంటి వాటికి నేను దూరంగా ఉంటాను.
పుష్ప 2 గురించి చెప్పండి?
ఇంకా సెట్స్‌లోకి వెళ్లలేదు. త్వరలో తప్పకుండా అప్డేట్ ఇస్తా.
మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరు? ఈ మధ్యనే వెళ్ళిన పుణ్యక్షేత్రం ఏంటి? ఏమైనా మొక్కుకున్నారా?
హనుమంతుడు. ఇటీవల శ్రీకాళహస్తికి వెళ్లాను. మనసులో అనుకున్నది చెప్తే నెరవేరదు అంటారు.