అమెరికాలో లక్షలు పలుకుతున్న నులక మంచం!

America: ఆధునికత కారణంగా చాలా వస్తువులు మూలన పడ్డాయి. కానీ వాటి విశిష్టత, వాటిని ఉపయోగించడం వల్ల కలిగే లాభాల వల్ల మళ్లీ చలామణిలోకి వచ్చేస్తున్నాయి. నిజానికి వాటి విలువ ఇప్పుడు వంద రెట్లు పెరిగింది. నాన్​స్టిక్​లు(Non stick), సిరామిక్(Ceramic)​ పాత్రల మోజులో పడిన ఆధునిక జనాలు మట్టి పాత్రల వాడకం తగ్గించినా నిపుణుల సూచన మేరకు మోడ్రన్​ కిచెన్​ మరింత మోడ్రన్​గా వచ్చి చేరాయి. అదేవిధంగా పలు ప్రాచీన వంటలు, వస్తువులకూ పూర్వ వైభవం వచ్చింది. అలాంటి వాటిలో ఇప్పుడు మన పల్లెల్లో విరివిగా కనిపించే నులక మంచం చేరిపోయింది.

అమెరికాలో ఈ మంచం ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు. అమెరికన్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ Etsy.com లో దీనిని విక్రయిస్తున్నారు. అంత ఖరీదు పలకడానికి దీని ప్రత్యేకత ఏమిటి? అంటే.. చెక్క మరియు చేతితో నేసిన తాడుతో తయారు చేసిన ఇండియన్ మేడ్ మంచం ఇప్పుడు కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. USలోని ఇ-కామర్స్ వెబ్‌సైట్ దీనిని అమ్మడానికి లక్ష రూపాయల ధర నిర్ణయించింది.

ఈ మంచం ప్రత్యేకంగా అలంకరణ కోసం కూడా వాడుకోవచ్చు. గదిలో లేదా ఆరు బయట ఇది చక్కగా అమరిపోతుంది. 36 అంగుళాల వెడల్పు, 72 అంగుళాల పొడవు 18 అంగుళాల ఎత్తు ఉన్న పంజాబీ స్టైల్ బెడ్‌ని ‘ఖాట్’ లేదా ‘మంజి’ అని కూడా పిలుస్తారట. ఈ మంచం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలంకరణ సామగ్రిలోనూ నులక మంచం చేరిపోవడంతో దీన్ని కొనేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. అదీ మరి విదేశాల్లో మన నులక మంచం విలువ!