దత్తత తీసుకుని.. పోషించి.. చివరికి గర్భవతిని చేసి..!
Viral News: ఓ పాపని దత్తత తీసుకుని.. పెంచి పెద్ద చేసి చివరికి ఆ పాపనే గర్భవతి చేసాడు ఓ కసాయి సవతి తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక షాలిమార్ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఓ జంట తమకు పిల్లలు లేకపోవడంతో బంధువుకు పుట్టిన పాపను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆ బాలిక క్లాస్‌రూంలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు చేసాక బాలిక ఐదు నెలల గర్భవతి అని తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లికి ఫోన్ చేసి చెప్పారు.
ఆ తర్వాత ఆ బాలిక తనను తండ్రే ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని.. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి కన్నీరుపెట్టుకుంది. అది విని ఆ తల్లి షాకైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. తన మరిది కూతురిని దత్తత తీసుకున్నామని.. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తాడని అనుకోలేదని ఆమె వాపోయింది.