Turmeric Milk: ఇలాంటి వారు తాగారంటే అంతే సంగతులు
Turmeric Milk: పాలల్లో పసుపు వేసుకుని తాగితే ఎంతో మంచిదని మన పెద్దలు చెప్తుంటారు. అందుకే దీనిని గోల్డెన్ మిల్క్ అంటారు. అయితే ఈ గోల్డెన్ మిల్క్ అందరూ తాగచ్చు అనుకుంటే పొరపాటే. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాగకూడదు.
ఇంతకీ ఈ గోల్డెన్ మిల్క్‌ని ఎవరు తాగకూడదు?
కాలేయ సమస్యలు ఉన్నవారు తాగకూడదు. దీని వల్ల కాలేయం మరింత చెడిపోయే ప్రమాదం ఉంది.
శరీరంలో ఐరన్ లోపించినవారు అస్సలు తాగకూడదు.
స్పైసీ ఆహారం పడని వారు తాగకూడదు. దీని వల్ల అలెర్జీ రియాక్షన్స్ వస్తాయి.
మలబద్ధకం, ఆక్నే, జీర్ణ సమస్యలు ఉన్నవారు తాగితే ఒంట్లో వేడి మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ పసుపు పాలు ఒంట్లో వేడిని పుట్టిస్తుంది.
గర్భిణులు ఈ గోల్డెన్ మిల్క్ తాగచ్చు కానీ మొదటి ట్రైమెస్టర్‌లో మాత్రం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే పసుపు పాలు అనేది కడుపులో వేడిని పెంచుతుంది. కాబట్టి గర్భిణులు మాత్రం వైద్యులను సంప్రదించే తీసుకోవడం ఉత్తమం.