Health: వందేళ్లు వర్ధిల్లేలా
Health: వందేళ్ల ఆయుష్షుని పెంచే ఆహారాలు ఉంటాయా? కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు వందేళ్లు పైబడిన వారు. ఈ వందేళ్లు పైబడిన వారిని సెంటనేరియన్స్ అంటారు. వీరు బ్లూ జోన్స్‌లో ఎక్కువగా ఉంటారు. మన ప్రపంచంలో బ్లూ జోన్‌గా పిలవబడే ప్రాంతాలు ఓకినావా (జపాన్), ఇకారియా (గ్రీస్), సార్డీనియా (ఇటలీ), లోమా లిండా (అమెరికా).
ఈ సెంటనేరియన్లు కేవలం జీవితాన్ని ఎంజాయ్ చేయడంపై మాత్రమే దృష్టిపెడతారు. వీరు ఒత్తిడిని అస్సలు దరిచేరనివ్వరు. కేవలం ఏదో విహారయాత్రలకు వెళ్తేనే ఎంజాయ్ చేస్తాం అనే ధోరణి వీరికి ఉండదు. రోజూ చేసే పనుల్లోనే ఎంజాయ్‌మెంట్ వెతుక్కుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో కాస్త ఎక్కువగా మొక్కల ఆధారిత ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. సెంటనేరియన్లు ఎక్కువగా తినే ఆహారాలు ఇవే.
చిక్కుడు, బఠాణీ, ఇతర ఆకుకూరలు. ఎక్కువగా ప్రొటీన్, ఫైబర్ ఉన్నవే తింటారు.
అన్నింటికీ ఆలివ్ నూనెనే వాడతారు
విత్తనాలు, నట్స్ ఎక్కువగా స్నాక్స్‌గా తింటారు
గ్రీన్ టీ, ఇతర హెర్బల్ టీలు తాగుతుంటారు
మాంసాహారం తినరు కానీ ఎక్కువగా చేపలు తినేందుకు ఆసక్తి చూపుతారు
చిలగడదుంపలు ఎక్కువగా తీసుకుంటారు
ఏదో ఒక రూపంలో పసుపును తీసుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తారు.