Health: డిన్న‌ర్‌లో ఇవి తింటున్నారా.. జాగ్ర‌త్త‌!

foods to avoid in dinner

Health: రోజంతా ఏం తిన్నా తిన‌క‌పోయినా డిన్నర్ స‌మ‌యంలో మ‌నం ఏం తింటున్నామ‌నేది చూసుకోవ‌డం చాలా ముఖ్యం. ఎందుకంటే తిన్న త‌ర్వాత నిద్ర‌పోయే స‌మ‌యం కాబ‌ట్టి తిన‌కూడ‌నివి తింటే నిద్ర‌ప‌ట్ట‌క క‌డుపునొప్పితో బాధ‌పడాల్సి వ‌స్తుంది. అస‌లు డిన్న‌ర్‌లో తిన‌కూడ‌నివి ఏంటో తెలుసుకుందాం.

మ‌సాలా, కారం వేసిన ఆహారాల‌కు దూరంగా ఉండండి. దీని వ‌ల్ల రాత్రంతా క‌డుపు మంట‌తో నిద్ర‌ప‌ట్ట‌దు

వేయించిన ఆహార ప‌దార్థాలు అంటే బ‌ర్గ‌ర్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి అస్స‌లు వ‌ద్దు. ఇందులో అధికంగా కొవ్వు ప‌దార్థాలు ఉంటాయి.

రాత్రివేళ‌ల్లో కార్బ్స్ ఉన్న ఆహారాలు తింటే బ‌రువు పెరుగుతారు. కార్బ్స్ అంటే అన్నం, నూడుల్స్, పాస్తా, బ్రెడ్ వంటివి.

రాత్రివేళ‌ల్లో ప‌చ్చి స‌లాడ్ మాత్రం అస్స‌లు తిన‌కూడ‌దు. ఎందుకంటే ప‌చ్చివి వెంట‌నే జీర్ణం కావు.

కేక్స్, ఐస్‌క్రీమ్స్ వంటివి తింటే బ్ల‌డ్ షుగ‌ర్ పెరిగిపోతుంది.

రాత్రి వేళ‌ల్లో మ‌ద్యం కూడా అస్స‌లు మంచిది కాదు.

చ‌పాతీలు వంటి లైట్ ఆహారాన్ని తీసుకుంటే మంచిది. అది కూడా 7 గంట‌ల లోపు తినేస్తే మ‌రీ మంచిది.