Corn: మొక్క‌జొన్న పొత్తుల‌ను ఎలా తినాలి? వేయించా.. ఉడికించా?

how to eat corn

Corn: మొక్క‌జొన్న‌ల్లో ఉండే పోష‌కాలు అన్నీ ఇన్నీ కావు. కాక‌పోతే మొన్న‌జొన్న పొత్తుల్ని ఉడికించి తింటే మంచిదా? లేక కాల్చి తింటే మంచిదా? అనే సందేహాలు వ‌స్తుంటాయి. ఈ మొక్క‌జొన్న అనేది మొద‌ట మెక్సికోలో పండించారు. దీనిని అమెరిక‌న్లు ప్ర‌తిరోజూ తింటుంటారు. ఇక మ‌న భార‌త‌దేశంలో అయితే ప్ర‌తీ ఒక్క ఆహార ప‌దార్థంలో దీనిని ఏదో ఒక రకంగా వాడేస్తున్నారు. ఒక అర‌క‌ప్పు ఉడికించిన మొక్కజొన్న గింజ‌లు తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు పుష్క‌లంగా ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వు ఇలా శ‌రీరానికి అందాల్సిన‌వ‌న్నీ అందుతాయి.

అయితే మొక్క‌జొన్న‌ను ఉడికించి తినాలా లేక వేయించుకుని తినాలా అనే సందేహం ఉంటే.. రెండు విధాలూ మంచివే. కాక‌పోతే అందులో ఉప్పు, చెక్క‌ర వేయ‌కుండా ఉండాలి. అప్పుడే అందాల్సిన పోష‌కాలు అందుతాయి. అలాగ‌ని ఎక్కువ తింటే మాత్రం బ్ల‌డ్ షుగ‌ర్ అమాంతం పెరుగుతుంది. రోజూ తినాల‌నుకుంటే చిన్న క‌ప్పు వ‌ర‌కు చాలు.