Health: గ‌ర్భిణుల కోసం టాప్ ఫుడ్స్

top foods for pregnant woman

Health:  గ‌ర్భిణులు తొలి రోజు నుంచే మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే అటు త‌ల్లి ఇటు పుట్ట‌బోయే బిడ్డ‌కు ఎంతో మంచిది. గ‌ర్భిణుల కోసం నిపుణులు సూచిస్తున్న టాప్ 10 ఆహార ప‌దార్థాలు ఇవే.

బ్లూబెర్రీల‌తో చేసుకునే యోగ‌ర్ట్

యోగ‌ర్ట్‌లో బ్లూబెర్రీలు వేసుకుని తింటే క‌లిగే పోష‌కాలు అంతా ఇంతా కాదు. బెర్రీ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. కాక‌పోతే బ‌య‌టికి తిన‌కుండా ఇంట్లోనే చేసుకుని తినండి.

మిక్స్‌డ్ న‌ట్స్

అన్ని ర‌కాల న‌ట్స్‌ను గుప్పెడు తీసుకుని తింటూ ఉండండి. నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే మ‌రీ మంచిది.

గుడ్లు

ఉడ‌క‌బెట్టిన గుడ్లు తిన్నా మంచిది. ఇందులో ఉండే ప్రొటీన్ కోలైన్ బిడ్డ మెద‌డు ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది.

పండ్లు పీన‌ట్ బ‌ట‌ర్

పీన‌ట్ లేదా ఆల్మండ్ బ‌ట‌ర్ అని దొర‌కుతుంది. దానిని పండ్ల‌పై వేసుకుని తింటే వ‌చ్చే ఎన‌ర్జీ అంతా ఇంతా కాదు.

స్మూతీలు

పండ్లు, ఆకుకూరల‌తో ర‌క‌ర‌కాల స్మూతీలు చేసుకుని తాగ‌చ్చు. మీకు న‌చ్చిన‌వి వేసుకుని వాటిని బ్లెండ్ చేసుకుని తాగండి. బాడీ డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఉంటుంది. ఈ న‌ట్ బ‌ట‌ర్‌లో శ‌రీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ప్రొటీన్, పొటాషియం, విట‌మిన్ ఈ పుష్క‌లంగా ఉంటాయి.

పండ్లు కాటేజ్ చీజ్

ఒక మూడు ర‌కాల పండ్ల‌లో ఇంట్లోనే కాటేజ్ చీజ్ త‌యారుచేసుకుని ఆ పండ్ల‌లో వేసుకుని తినండి. కాటేజ్ చీజ్ త‌యారీ వీడియోలు యూట్యూబ్‌లో బోలెడు ఉన్నాయి.

ఈ స‌మాచారం కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. ఏదైనా వైద్యుల‌ను సంప్ర‌దించడం మంచిది.