Health: మొల‌క‌లెత్తిన ఆలూ తిన‌చ్చా?

can we eat sprouted potato

Health: ఆలుగ‌డ్డ కొని ఫ్రిజ్‌లోనో లేక బ‌య‌ట చాలా రోజుల పాటు ఉంచేస్తే అవి మొల‌కలెత్తుతాయి. మ‌రి ఆ మొల‌క‌లెత్తిన ఆలూని తిన‌చ్చా? లేక ప‌డేయాలా? సాధార‌ణంగా ఆలుగ‌డ్డ‌ల‌కు మొల‌క‌లు వ‌చ్చాయంటే అందులో మ‌రిన్ని పోష‌కాలు ఉన్న‌ట్లు అర్థం. కానీ ఎక్కువ మొల‌క‌లు వ‌చ్చినా కాస్త ప్ర‌మాద‌మే అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆలుగ‌డ్డ‌ల్లో సొలానైన్, చాకోనైన్ అనే ప‌దార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. కానీ ఎక్కువైతే మాత్రం విషపూరితం.

అయితే ఆలుగ‌డ్డ‌ల‌కు మొల‌క‌లు వ‌స్తే వాటిని తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే అలాంటి గ‌డ్డ‌ల్లో అధికంగా సోలోనైనా చాకోనైన్ ప‌దార్థాలు ఉంటాయి. ఇవి శ‌రీరానికి మంచివి కావు. అలాంటి గ‌డ్డ‌లు తింటే వాంతులు, విరోచ‌నాలు, క‌డుపు నొప్పి, త‌ల‌నొప్పి వంటి సాధార‌ణ స‌మ‌స్య‌ల‌తో పాటు మ‌నిషి కోమాలోకి వెళ్లి చనిపోయే ప్ర‌మాదం కూడా లేక‌పోలేద‌ట‌.

గ‌డ్డ‌ల్లో ఎక్కువ మొల‌క‌లు వ‌స్తే అది గ‌డ్డ‌లోని పోష‌కాలను లాగేసుకుంటుంది. దాంతో ఆలుగ‌డ్డ చేదుగా మారిపోతుంది. చాలా మంది మొల‌క‌లు తీసేసి తొక్కు తీసి తింటుంటారు. దానికి బ‌దులు అవి ప‌డేసి తాజా గ‌డ్డ‌లు తీసుకోవ‌డం మంచిది. ఆలుగ‌డ్డ‌ల‌ను ఎప్పుడూ పొడిబారిన ప్ర‌దేశాల్లో ఉంచాలి. ఫ్రిజ్‌లో పెడితే వాటిలో చెక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.