గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో శృంగారం చేయొచ్చా?

is it good to have sex during pregnancy

Pregnancy: చాలా మంది గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో శృంగారం చేయొచ్చో లేదో అనే అనుమానం ఉంటుంది. ఒక‌వేళ చేసినా క‌డుపులో బిడ్డ‌కు ఏమ‌న్నా ప్ర‌మాదం జ‌రుగుతుందేమోని భ‌య‌ప‌డిపోతుంటారు. అస‌లు గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు శృంగారం చేయొచ్చా? ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

గ‌ర్భం దాల్చిన‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఎప్ప‌టిలాగే శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక‌వేళ గ‌ర్భం దాల్చిన‌ప్పుడు కాంప్లికేష‌న్స్ ఉన్నాయ‌ని వైద్యులు చెప్తే మాత్రం సెక్స్ జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.

తొలి ట్రైమెస్ట‌ర్ స‌మ‌యంలో సెక్స్ చేస్తే అబార్ష‌న్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఒక‌వేళ రిస్క్ లేక‌పోయినా ఇన్‌ఫెక్ష‌న్ సోకే ప్ర‌మాదం లేక‌పోలేదు.

ఇన్‌ఫెక్ష‌న్ రిస్క్ ఉందో లేదో వైద్యులు చెప్తారు. దానిని బ‌ట్టి ఫాలో అవ్వ‌డం మంచిది.

కావాలంటే కౌగిలించుకోవ‌డం… మ‌సాజ్‌లు వంటివి చేసుకుంటే మంచిది.

గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో హార్మోన్స్‌లో చాలా మార్పులు ఉంటాయి. ఆ స‌మ‌యంలో సెక్స్ కోరిక‌లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. వాటిని నియంత్రించుకోవ‌డం మంచిది. బిడ్డ ఆరోగ్యంగా ఉండి ఎలాంటి రిస్క్ లేకుండా డెలివ‌రీ అయిపోయి న త‌ర్వాత శృంగార చర్య‌ల్లో పాల్గొంటే బెట‌ర్.

ఇక మూడో ట్రైమెస్ట‌ర్ స‌మ‌యంలో బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. ఆ స‌మ‌యంలో శృంగారంలో పాల్గొంటే బిడ్డ‌కు ఇబ్బందిక‌రంగా ఉంటుంది. ఒక‌వేళ గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో ఇన్‌ఫెక్ష‌న్లు, బ్లీడింగ్ అయ్యే అవ‌కాశం ఉంటే అస‌లు చేయ‌క‌పోవ‌డం ఉత్త‌మం.

ఒక‌వేళ IVF ద్వారా గ‌ర్భం దాల్చినా.. క‌డుపులో క‌వ‌ల‌లు ఉన్నా.. లేదా గ‌తంలో అబార్ష‌న్లు అయిన హిస్ట‌రీ ఉంటే మాత్రం లైంగిక చ‌ర్య‌లు అస్స‌లు వ‌ద్దు.