Virender Sehwag: 400 కోట్లు వ‌స్తున్నాయ్.. రాహుల్‌ని తిట్ట‌డమెందుకు?

virender sehwag slams sanjiv goenka for scolding kl rahul

Virender Sehwag: స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో ఓడిపోయినందుకు ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ని అంద‌రి ముందు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా తిట్ట‌డంపై మండిప‌డ్డారు మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్. టీం య‌జ‌మానులు ఎప్పుడూ కూడా పిచ్‌పై ఉన్న ఆట‌గాళ్ల‌ను కానీ బ్యాక్‌రూం వ‌ర్క‌ర్ల‌పై కానీ నోరుపారేసుకోకూడ‌ద‌ని సెహ్వాగ్ హెచ్చ‌రించారు. అలాగ‌ని డ్రెస్సింగ్ రూంలో తిట్ట‌మ‌ని తాను చెప్ప‌డం లేద‌ని.. గెలిచినా ఓడినా య‌జ‌మానులు ఎప్పుడూ కూడా వారిని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు మాట్లాడాలే కానీ కోపంతో ఊగిపోతే వ‌చ్చేది ఏమీ లేద‌ని తెలిపారు.

మ్యాచ్ ఓడినా గెలిచినా సంజీవ్ గోయెంకాకు దాదాపు రూ.400 కోట్ల లాభం వ‌స్తుంద‌ని.. అలాంట‌ప్పుడు రాహుల్‌ని తిట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని మండిప‌డ్డారు. ఆట‌గాళ్ల‌కు కోపం వ‌స్తే వారిని వేరే టీంలోకి తీసుకుంటారని.. కానీ ఓ టీం ఆట‌గాడిని కోల్పోయిందంటే వారికే న‌ష్టం అని క్లాస్ పీకారు.