Mohammed Shami: సిగ్గుండాలి అలా తిట్టడానికి.. LSG యజమానిపై షమి మండిపాటు
Mohammed Shami: మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లఖ్‌నౌ సూపర్ జైంట్స్ ఓడిపోవడంతో ఆ టీం యజమాని సంజీవ్ గోయెంకా.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అందరి ముందు తిట్టడంపై మండిపడ్డారు పేసర్ మహ్మద్ షమి. ఒక కెప్టెన్‌ని పేరున్న ఆటగాడిని పట్టుకుని అలా అందరి ముందు తిట్టి అవమానించినందుకు సంజీవ్‌కు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
“” మ్యాచ్ ఓడిపోయినందుకు యజమానికి కోపం రావడం సహజమే. అలాగని అందరి ముందు తిట్టేస్తారా? డ్రెస్సింగ్ రూంలోనో లేదా హోటల్‌లోనో పర్సనల్‌గా తిట్టాల్సింది. రాహుల్ కేవలం ఆటగాడు కాదు. టీం కెప్టెన్. ఒక్కోసారి ప్లాన్ కలిసొస్తుంది ఒక్కోసారి కలిసిరాదు. అలాగని ఇలా నలుగురిలో అవమానించడం ఏంటి? సంజీవ్ గోయంకా ఒక గౌరవనీయమైన వ్యక్తి. అతన్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. ఇలాంటి పని చేసి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అందరి ముందు కేఎల్ రాహుల్‌ని తిట్టినంతమాత్రాన ఆయనేమన్నా ఎర్రకోటపై జెండా ఎగరేసాను అనుకుంటున్నాడేమో. సిగ్గుండాలి “” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.