KL Rahul: కెప్టెన్సీని వీడనున్న రాహుల్?
KL Rahul: నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్నౌ సూపర్ జైంట్స్ మ్యాచ్‌లో జైంట్స్ ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో జైంట్స్ అధినేత సంజీవ్ గోయెంకా.. టీం కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్‌ని స్టేడియంలోనే అందరి ముందు తిట్టారు. దాంతో ఆయన తిడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎంత కోపం ఉన్నా ఇలాంటివన్నీ డ్రెస్సింగ్ రూంలో చూసుకోవాలి కానీ ఇలా వేలాది మంది నడుమ పరువు తీయాలా అంటూ అభిమానులు తిట్టిపోస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ లఖ్నౌ సూపర్ జైంట్స్ టీంను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా జైంట్స్‌కు రెండు ఆటలు మిగిలి ఉన్నాయి. ఈ రెండు ఆటల్లో కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గా ఉండి తనని తాను నిరూపించుకోకపోతే జైంట్స్ మేనేజ్మెంటే రాహుల్‌ని తీసేస్తుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇంకో ఐదు రోజుల్లో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్నారు. ఈలోగా ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది. 2024 సీజన్‌కు గానూ.. లఖ్నౌ సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్‌ను రూ.17 కోట్లకు కొనుగోలు చేసింది.