Kirak RP: జగన్ లాంటి రావణాసురుడిని చంపాలంటే వానర సైన్యం కావాల్సిందే
Kirak RP: జగన్ మోహన్ రెడ్డి ఒక రావణాసురుడని.. అతన్ని చంపాలంటే కచ్చితంగా కూటమి లాంటి వానర సైన్యం కావాల్సిందే అని అన్నారు కమెడియన్ కిరాక్ ఆర్పీ. ఆయన తెలుగు దేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. “” జగన్.. దయచేసి సింహం సింగిల్‌గా వస్తుంది అని నిన్ను సింహంతో పోల్చుకోకు. సింహం వింటే సిగ్గుతో చచ్చిపోతుంది. సింహానికి ఉండే ఒక్క లక్షణం నీలో లేదు. బాబాయ్‌ని చంపి నువ్వు సీఎం అవ్వాలి. చెల్లెల్ని రోడ్డు మీదకు ఈడ్చి నువ్వే గెలవాలి. కోడి కత్తి శ్రీను, వివేకా హత్య కేసులో దస్తగిరి, రాళ్ల దాడి కేసులో బాధితుడిని నీ అవసరాలకు వాడుకుని వారి జీవితాలు నాశనం చేసావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు చదువుకున్న వారు కాబట్టి వివేకంతో ఆలోచించి ఓటు వేయండి. మళ్లీ జగన్‌ను గెలిపిస్తే ఇంక ఎవ్వరి ఇళ్లల్లో వెంకటేశ్వరస్వామి, అల్లా, ఏసు ప్రభు ఫోటోలు ఉండవు. జగన్ మోహన్ రెడ్డి ఫోటో, ఆయన పక్క రోజా ఫోటోలు ఉంటాయి. పూజారిగా అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు. కాబట్టి బాగా ఆలోచించుకుని మీ జీవితాలు బాగుపడాలంటే ఎవరికి ఓటు వేయాలో కుటుంబం అంతా కూర్చుని చర్చించుకుని ఓటు వేయండి “” అని తెలిపారు.