చంద్రబాబు బెయిల్ రద్దుపై ఈరోజే సుప్రీం కీలక విచారణ
Chandrababu Naidu: ఏపీ సీఐడి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ రద్ద పిటిషన్పై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానంలో కీలక విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. అయితే బెయిల్ ఇస్తూ విధించిన కొన్ని షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని.. రెడ్ బుక్లో అందరి పేర్లు రాసాం అధికారంలోకి వచ్చాక అందరి పని చెప్తాం అంటూ బెదిరింపులకు పాల్పడటం షరతును ఉల్లంఘించడమే అని ఏపీ సీఐడి బెయిల్ రద్దు పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాదోపవాదాలు విన్నాక తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దుపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఏమివ్వబోతోందా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.