మా అమ్మ నా భర్తతో పడుకుంది.. ఓ యువతి ఆవేదన
Lifestyle: ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? ఓ తల్లి కూతురి భర్తతో పాడు పని చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఏ కష్టం వచ్చినా తల్లికి చెప్పుకునే ఆ మహిళ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో సోషల్ మీడియాలో తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ యువతి తన పేరు చెప్పకుండా రెడిట్ యాప్‌లో తన సాడ్ స్టోరీని నెటిజన్లతో షేర్ చేసుకుంది.
“” హాయ్ ఫ్రెండ్స్. నాకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని మీతో పంచుకోవాలని ఉంది. మీకు తోచిన సలహా ఇవ్వండి ప్లీజ్. నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టం. తనే నా బెస్ట్ ఫ్రెండ్. నాకు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. నా భర్త నన్ను, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడు. పిల్లలు పెద్దయ్యే కొద్ది నేను మా అమ్మకు మరింత దగ్గరయ్యాను. ఆమెను నా ఇంట్లోనే ఉంచుకున్నాను. మా అమ్మ మంచిదే కానీ ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అందరినీ తన మాయ మాటల్లో పడేస్తుంటుంది.
ఓసారి మా ఇంట్లో పార్టీ జరిగింది. అందరం తాగి ఉన్నాం. నేను పిల్లల కోసం త్వరగా నా పడక గదిలోకి వెళ్లిపోయాను. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నా భర్త మాత్రం గదిలోకి రాలేదు. ఎక్కడికి వెళ్లారబ్బా అని నేను ఆయన కోసం వెతుకుతుంటే.. మా అమ్మతో బెడ్‌పై కనిపించాడు. అది చూసి నాకు గుండె ఆగిపోయింది. కోపం ఏడుపు వచ్చాయి. అలాగని నా భర్తను వదిలేయలేను. ఎందుకంటే ఆయనంటే నాకు ఇష్టం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కి కూడా చెప్పలేదు. చెప్తే నన్ను ఎక్కడ దూరం పెడతారో అని భయం. చేసిన తప్పుకి మా ఆయన సారీ చెప్తూనే ఉన్నారు. కానీ క్షమించగలిగే చిన్న తప్పా అది? రాత్రిళ్లు నిద్రపట్టడంలేదు. నిద్ర మాత్రలు వేసుకుని పడుకోవాల్సిన పరిస్థితి “” అని వెల్లడించింది.
ఆమె పోస్ట్ పట్ల చాలా మంది నెటిజన్లు షాకయ్యారు. వెంటనే మీ అమ్మను బయటికి పంపించేయ్.. మీ ఆయనకు విడాకులు ఇవ్వు అంటూ ఆమెను ఓదారుస్తున్నారు.