TTD వద్ద రూ.3.2 కోట్ల 2000 నోట్లు..!
TTD: గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్లను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలో దాదాపు 96% వరకు రూ.2000 నోట్లు వెనక్కి వచ్చేసాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థాముల నుంచి దాదాపు రూ.3.2 కోట్ల విలువైన రూ.2000 నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
2023 అక్టోబర్ 8 నుంచి మొదలైన ఈ ప్రక్రియ 2024 మార్చి 24 వరకు కొనసాగిందట. రూ.2000 నోట్లు వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో భక్తులు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరుమల హుండీలో వేసేసారని.. దాంతో ఎక్కడా లేని నోట్లు ఆలయ హుండీలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదు విడతల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్‌కు చేరవేసారు. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన అధికారులు కూడా రోజూ ఆలయంలోని హుండీని లెక్కపెట్టాల్సి వచ్చిందట.