Breast Cancer: 2040 నాటికి 10 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు

Breast Cancer: ఆడ‌వారిలో ఎక్కువ‌గా వ‌చ్చే బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌ల్ల 2040 నాటికి 10 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు సంభ‌విస్తాయ‌ని లాన్సెట్ స్ట‌డీ వెల్ల‌డించింది. 2015 నుంచి 2020 వ‌ర‌కు దాదాపు 7.8 మిలియ‌న్ మంది మ‌హిళ‌లు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన ప‌డ్డారు. 2020లో దాదాపు 6,85,000 మంది మ‌హిళ‌లు మృతిచెందారు. 2020 వ‌ర‌కు 2.3 మిలియ‌న్ కేసులు పెర‌గ్గా.. ఈ సంఖ్య 2040 నాటికి 3 మిలియ‌న్‌కు చేరుతుంద‌ని లాన్సెట్ స్ట‌డీ వెల్ల‌డించింది. త‌క్కువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి సంపాద‌న క‌లిగిన‌ దేశాల్లో ఈ కేసులు మ‌రీ ఎక్కువ‌గా ఉన్నాయి.

కొంత మందికి ల‌క్ష‌ణాలు తెలీక నిర్ల‌క్ష్యం చేసి ప్రాణాలు కోల్పోతుండ‌గా.. మ‌రికొంద‌రు మ‌హిళ‌లు ఆర్థిక స్తోమ‌త లేక‌.. వైద్యుల నుంచి స‌రైన క‌మ్యునికేష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ వ్యాధికి బ‌లైపోతున్నార‌ట‌. ప్ర‌తి వైద్య నిపుణుడు త‌మ‌కు తోచినంత‌గా బ్రెస్ట్ క్యాన్స‌ర్ గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తుండాల‌ని.. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే పేషెంట్ల‌కు ధైర్యాన్ని ఇస్తుండాల‌ని రేష్మా అనే అమెరికాకు చెందిన వైద్యురాలు వెల్ల‌డించారు. చికిత్స స‌మ‌యంలో తీసుకోవాల్సిన ఆహారాలు, జాగ్ర‌త్త‌లు వంటివి ఎప్ప‌టిక‌ప్పుడు పేషెంట్ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సిన బాధ్య‌త వైద్యుల‌దే అని ఆమె పేర్కొన్నారు.