Pithapuram పీఠం ఎవరిది? స‌ర్వేలు ఏం చెప్తున్నాయి?

Pithapuram: ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల (AP Elections) పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతోంది. ముఖ్యంగా తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌ధాన నేత‌లు పోటీ చేసే సీట్ల నుంచి ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే దానిపై ప‌లు స‌ర్వేలు జ‌రుగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) కుప్పంలో.. ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి (Daggubati Purandeswari) రాజ‌మండ్రిలో సులువుగానే గెలిచేస్తారు. ఇక్క‌డ ఫోక‌స్ అంతా పాపం గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైనే (Pawan Kalyan) ఉంది.

పిఠాపురంలో ప‌వ‌న్‌ను ఎలాగైనా ఓడించాల‌ని YSRCP వంగ గీత‌ను (Vanga Geetha) దింపింది. అంతేకాదు.. కాపు ఓట్లు ప‌వ‌న్‌కు పోకుండా మిథున్ రెడ్డితో పాటు మ‌రో ఐదుగురు కాపు నేత‌ల‌ను బ‌రిలోకి దింపి ఓట‌ర్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో పిఠాపురంలో తెలుగు దేశం, వైసీపీ, జ‌న‌సేన పోటీలో ఉన్నాయి. వైసీపీ నుంచి పెండెం దొర‌బాబు విజ‌యం సాధించారు. సుమారు 44 శాతం ఓటు షేరు వ‌చ్చింది. తెలుగు దేశం నుంచి ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ పోటీ చేస్తే 36 శాతం ఓటు షేరు వ‌చ్చింది. జ‌నసేన నుంచి శేష‌కుమారి పోటీ చేయ‌గా.. 15 శాతం ఓటు షేరు ద‌క్కింది.

మ‌రి ఇప్పుడు ఓటు షేరు ఎంత పెరుగుతుంది?

ప‌లు స‌ర్వేల‌ను బ‌ట్టి చూస్తే ఇప్పుడు ఓటు షేరు జ‌న‌సేన‌కు అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 60.3 శాతం వ‌చ్చేలా ఉంద‌ని తెలుస్తోంది. వైసీపీకి 32.7 శాతం.. కాంగ్రెస్‌కు 3.3 శాతం వ‌చ్చేలా ఉంద‌ని ప‌లు స‌ర్వేలు చెప్తున్నాయి. పిఠాపురంలోని ప్ర‌జ‌లు కూడా ప‌వ‌న్ గెలుస్తారా ఓడిపోతారా అని కాకుండా ఎంత మెజారిటీ వ‌స్తుంద‌నే చ‌ర్చించుకుంటున్న‌ట్లు స్థానికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.