Parkinson’s Disease: మీ చేతి రాత మారిందా? అయితే ఈ రిస్క్ ఉన్నట్లే
Parkinson’s Disease: మన చేతి రాతలో వచ్చే మార్పులతోనే పార్కిన్సన్స్ వ్యాధి ఉందో లేదో తెలిసిపోతుందట. మీరు ఎప్పుడూ రాసేలా మీ చేతి రాత లేకపోయినా.. చిన్నగా.. అడ్డంగా రాస్తున్నట్లు కనిపించినా పార్కిన్సన్స్ వ్యాధిలో కనిపించే మొదటి లక్షణంగా భావించాలి. అమెరికా, బ్రిటన్ దేశాలతో పోలిస్తే మన భారత్‌లో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్థుల శాతం తక్కువే అని చెప్పాలి. అయినప్పటికీ ఈ వ్యాధి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎక్కువగా పెద్దల్లో కనిపించే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు చిన్నవిగా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
పార్కిన్సన్స్ వ్యాధి మొదటి లక్షణాలు
సాధారణంగా నడవలేరు
కాళ్లు, చేతులు వణుకుతూ ఉంటాయి
చేతి రాతలో మార్పులు
డిప్రెషన్
యాంక్జైటీ
వాసన రాకపోవడం
నిద్రలేమి
ALSO READ: World Parkinson’s Day: ఈ వ్యాధికి చికిత్స ఉందా?
ఇక్కడ మనం ముఖ్యంగా చేతి రాతపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే.. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కళ్లు కనిపించకో, చేతులు వణకడంతోనో చేతి రాతలో మార్పులు వస్తాయి. ఇది సహజంగా జరిగేదే. కానీ పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నా కూడా ఇలాగే చేతి రాత మారుతుంది. కాబట్టి.. మీ ఇంట్లో పెద్దల చేతి రాతలో మార్పులు ఉంటే అది వ్యాధి వల్ల మారిందా లేక వయసు మీద పడటం వల్ల మారిందా అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.