Summer: ఈ వేసవికి మన ఇంటి కూల్‌డ్రింక్స్..!
Summer: ఎండాకాలం వచ్చేసింది. వేడిగాల్పులు ఇప్పుడే వీస్తున్నాయి. ఈ వేసవిలో చల్లగా ఏదన్నా తాగాలనిపిస్తుంది. ఇందుకోసం కోకోకోలా వంటి కూల్‌డ్రింక్స్ తాగేస్తుంటారు. ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కాకుండా శరీరానికి చల్లదనం, ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రింక్స్‌ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
సత్తు షర్బత్
వేపిన సెనగలను పిండిగా చేస్తే దానినే సత్తు పిండి అంటారు. సత్తులో ప్రొటీన్, క్యాల్షియం, మ్యాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఒక గ్లాసులో 5 స్పూన్ల సత్తు పౌడర్‌కి 250 మిల్లీ లీటర్ల నీళ్లు, కాస్త ఉప్పు, నిమ్మకాయ కలిపితే సత్తు షర్బత్ రెడీ. ఎంత వల్ల అలసటగా అనిపించినా ఓపిక లేనట్లుగా ఉన్నా ఈ సత్తు షర్బత్ చేసుకుని తాగండి. వెంటనే ఎనర్జిటిక్ అవుతారు.
గోంధ్ శిఖన్జీ
ఎండాకాలంలో చాలా మంది తరచుగా నిమ్మకాయ రసం తాగుతుంటారు. కానీ.. నిమ్మరసంలో మరో పదార్థాన్ని కలిపితే డబుల్ బినిఫిట్ ఉంటుంది. అదే గోంధ్ కఠీరా. 200 మిల్లీలీటర్ల నీళ్లలో కలకండ, నిమ్మరసం, నల్ల ఉప్పు, మిరియాల పౌడర్, రెండు పెద్ద స్పూన్ల గోంద్‌ని యాడ్ చేస్తే సరిపోతుంది. మార్కెట్‌లో గోంద్ అని అడిగితే ఇస్తారు. (Summer)
కీరా జ్యూస్
ఒంట్లోని కొవ్వును కరిగించుకుంటూ.. ఎండలో కూల్‌గా ఉండాలంటే కీరా డ్రింక్ బెస్ట్. ఒక కీరాను కట్ చేసి మిక్సీలో వేయండి. తొక్క తీయకండి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో ఒక నిమ్మకాయ, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి సగం గ్లాసు నీళ్లు పోసి మిక్సీ చేస్తే కీరా డ్రింక్ రెడీ.
కచ్చి లస్సీ
ఇది పంజాబ్‌లో చాలా పాపులర్. పంజాబీలకు వేసవి అంటే కచ్చీ లస్సీ లేకుండా పూర్తవదు. ఇదొక్క లస్సీలో పెరుగుకు బదులు పాలను వాడతారు. ఒక గ్లాసులో పాలు తీసుకుని.. అందులో ఒక పెద్ద స్పూన్ కలకండ పొడి, కాసిన్ని నీళ్లు కలుపుకుని తాగితే కచ్చీ లస్సీ రెడీ.
వాటర్‌మెలన్ మింట్ కూలర్
పుచ్చకాయ, పుదీనాతో తయారుచేసే ఈ డ్రింక్‌తో బాడీకి చలవ చేస్తుంది. ఇక దీని టేస్ట్ చెప్పక్కర్లేదు. గింజలు తీయకుండా పుచ్చకాయ ముక్కలు, పుదీనా యాడ్ చేసి మిక్సీ పట్టండి. అంతే.. వాటర్‌మెలన్ మింట్ కూలర్ రెడీ. ట్రై చేసి చూడండి.
జల్జీరా
ఒకవేళ మీకు అరుగుదల సమస్య ఉంటే.. జల్జీరా ఎక్కువగా తాగాలి. మిక్సీలో కొన్ని పుదీనా ఆకులు, వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు, సైంధవ లవణం, మిరియాలు, ఇంగువ, కాసిన్ని నీళ్లు పోసి బ్లెండ్ చేయండి. దీనినే జల్జీరా పొడి అంటారు. ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని అందులో బెల్లం పొడి, నిమ్మరసం కలిపి చివర్లో జల్జీరా పొడిని కలిపేయండి. (Summer)