Health: కారమా? కాలకూట విషమా?
Health: కారం పొడి వాడని వంటిల్లు ఉండదు. కొందరు కారం పొడికి (Chilli Powder) బదులు పచ్చి మిరపకాయలు వాడుతుంటారు. కానీ కారం లేని భోజనం అయితే చేయకుండా ఉండలేం కదా.! మరి మన ఇంట్లో వాడే కారణం పొడి మంచిదా కాదా అని తెలుసుకోవడం ఎలా? ఇప్పుడ ఎన్నో బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది బెస్ట్ అని ఎలా తెలుస్తుంది? అసలు మార్కెట్లో కొన్న కారం పొడిని ఇంట్లో వాడుకోవచ్చా? వంటి విషయాలను తెలుసుకుందాం. (Health)
ఇప్పుడున్న కాలంలో మిర్చి పండించే రైతులు పచ్చి మిర్చి చిన్న పువ్వుగా రాగానే వెంటనే పురుగుల మందులు కొట్టేస్తున్నారని ఓ నివేదికలో తేలింది. ఆ పురుగుల మందు కూడా పై పైన చల్లడంలేదు. ఏకంగా పురుగుల మందుతో పంటకు స్నానం చేయించేస్తున్నారనే చెప్పాలి. ఆ కొట్టిన పురుగుల మందులో ఒక శాతం మాత్రమే మొక్కపై ఉంటోంది. మిగతా 99 శాతం భూమిలోకి ఇంకిపోతోంది. ఎక్కువ మోతాదులో పురుగుల మందు కొట్టడం వల్ల కొద్ది శాతం మందు మిరపపైనే ఉండిపోయి ఆవిరైపోతోంది. మిరప సైజు పెరిగాక మళ్లీ పురుగు పడుతోందని పురుగుల మందు వాడుతుంటారు.
ALSO READ: Medical Test చేయించుకుంటున్నారా.. జాగ్రత్త!
పచ్చి మిరపకాయ పిందె నుంచి పండు మిరపకాయగా మారే వరకు పలు మార్లు పురుగుల మందులు కొట్టేస్తుంటారు. ఇలా అందరూ చేస్తారని కాదు కానీ చాలా చోట్ల ఇదే జరుగుతోంది. మిరపపై కనీసం 25 లేయర్ల పురుగుల మందు వాడుతున్నారని టాక్. అందుకే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇలా చేసేవారిపై నిఘా వేసి ఉంచుతున్నారు.
పండు మిర్చి ఎలా వస్తుంది?
పచ్చి మిర్చి ఎండు మిర్చిగా మారిన తర్వాత కోసేసి దానిని కల్లాంపై ఎండబెడతారు. ఎండకు కాలి పండు మిర్చి కాస్తా సహజంగా ఎండు మిరపకాయగా మారుతుంది. ఎండు మిర్చిని తయారుచేసే పద్ధతి ఇదే. సహజంగా ఎండకు పండు మిర్చి బాగా ఎండితేనే అది నేచురల్ ఎండు మిర్చిగా మారుతుంది. ఇలా సహజంగా ఎండకు ఎండిన ఎండు మిర్చిని తుంచితే తేలికగా ముక్కలవుతుంది. అదే ఆ ఎండు మిర్చి ఎంత తుంచినా ముక్కలు కాకుండా సాగుతోందంటే పురుగుల మందు ఎక్కువగా వాడేసారని అర్థం. పురుగుల మందుకు పండు మిర్చి నాని నాని.. అది ఎండలో ఉంచినా కూడా ఎండు మిర్చిలా మారలేకపోతుంది. ఇలా ఉంటే అది కచ్చితంగా కెమికల్స్, పురుగుల మందు ఎక్కువగా వాడేసారని అర్థం. ఇలాంటి కాలకూట విషంతో సమానమైన కారం పొడిని మనం రోజూ తింటుంటే మాత్రం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు తప్పవు.
ALSO READ: మందులు లేకుండా వీర్యకణాల కౌంట్ పెరగాలంటే..!?
మరి కారం తినాలా వద్దా?
ఇలాంటి కెమికల్స్ ఎక్కువగా వాడేసిన కారం బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కారం పొడికి బదులు మిరియాల పొడిని వాడుకోవడం బెటర్. కారం పొడిని చాలా ప్రదేశాల్లో మిరియాల పొడిని ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. తోక మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మిరియాల్లో కూడా బొప్పాయి గింజలను పెట్టి కల్తీ చేస్తున్నారు. కాకపోతే మిరియాల్లో ఎక్కువగా కల్తీ చేసే అవకాశం ఉండదు కాబట్టి పెద్దగా రిస్క్ ఉండదు. కారం బదులు ఈ తోక మిరియాలు వాడుకోవడం బెటర్. ఒకవేళ తప్పనిసరిగా కారం పొడే వాడాలనుకుంటే ఇలా చేసి చూడండి.
నేరుగా కారం పొడి కొనేయకుండా ముందు ఎండు మిర్చిని కొని తెచ్చుకోండి. ఒక రెండు మూడు రోజుల పాటు మండుటెండలో పెట్టండి. ఆ తర్వాత ఎండు మిర్చిని ఒక ఐదు నిమిషాల పాటు వేయించండి. ఆ తర్వాత మిల్లుకు తీసుకెళ్లి కారం పొడిగా దంచుకోండి. ఇలా చేస్తే కెమికల్ వల్ల కలిగే హాని కొంత వరకు తగ్గుతుంది.
ALSO READ: Eggs: గుడ్లను వీటితో అస్సలు తినకండి