Vastu: గడియారం ఏ వైపు పెడితే మంచిది?
Vastu: ఇంట్లో గడియారం పెట్టే దిశలు కూడా వాస్తు ప్రకారం ఉంటేనే మంచిదట. గడియారాన్ని కొనేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే వాస్తు దోషాలు తప్పవు అని అంటున్నారు నిపుణులు.
*గడియారం ఎప్పుడూ కూడా మీ ఇంటికి దక్షిణం వైపు ఉండకూడదు. ఇలా ఉంటే మంచిది కాదు.
*తలుపులపై గడియారాలను వేలాడేలా మాత్రం ఎప్పుడూ పెట్టకండి. (vastu)
*గడియారం ఉత్తర, తూర్పు, పడమర దిశల్లో పెడితే ఎంతో మంచిది.
*పెండలం గడియారాలు ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. వాటి నుంచి వచ్చే శబ్దం పాజిటివిటీని నింపుతుంది. అయితే దీనిని తూర్పు వైపున మాత్రం పెట్టద్దు.
*ఒకవేళ మీరు మీ పడక గదిలో గడియారాన్ని పెట్టుకోవాలంటే తూర్పు వైపున పెట్టుకోండి. తూర్పు దిక్కు లేకపోతే ఉత్తరం దిక్కున పెట్టుకోండి. (vastu)
*గడియారాలు ఎప్పుడూ కూడా ఇంటి బయటపెట్టకండి. అస్సలు మంచిది కాదు.
*గడియారంలో సమయం ఎప్పుడూ కూడా తప్పుగా చూపించకూడదు. సరైన సమయంలోనే ఉండాలి. కావాలంటే రెండు మూడు నిమిషాలు ఫాస్ట్ అయినా ఫర్వాలేదు కానీ నెమ్మదిగా మాత్రం ఉండకూడదు.
*గడియారం అద్దం ఎప్పుడూ పగుళ్లు, మరకలు లేకుండా చూసుకోండి. లోపల ముల్లులు విరిగిపోయినా తీసేయండి.