EXCLUSIVE: 18 ఏళ్ల లోపు పిల్లలకి షుగర్ వస్తే ఏం చేయాలి?
EXCLUSIVE: డయాబెటిస్ (diabetes) అనేది ఎవరికైనా రావచ్చు. ఇది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మందులపైనే ఉండాలి. సరైన డైట్ తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు. అయితే కొందరికి టైప్ 1 డయాబెటిస్ 18 ఏళ్లు నిండకుండానే వచ్చేస్తుంటుంది. అలాంటివారికి అసలు షుగర్ అనేది తగ్గదా? జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలా?
18 ఏళ్ల లోపు పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ వస్తే జీవితాంతం ఇన్సులిన్, మందులు వేయాల్సిన అవసరం లేదని ప్రముఖ పోషకాహార నిపుణులు వీరమాచినేని రామకృష్ణ అంటున్నారు. ఇవన్నీ జీవనశైలికి సంబంధించిన జబ్బులు కాబట్టి తినే తిండితోనే తగ్గించుకోవచ్చని అంటున్నారు. మొదటి రోజు నుంచి మందులు, ఇన్సులిన్ లేకుండా చక్కని డైట్ రాయించుకుని క్రమం తప్పకుండా పాటిస్తే పిల్లలకు కచ్చితంగా ఈ వ్యాధి నుంచి ఉపశమనం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డైట్ చేస్తున్నంత సేపు డయాబెటిస్ తగ్గుతుంది కానీ తగ్గిపోయింది కదా అని మళ్లీ పాత పద్ధతిలోనే ఇష్టారాజ్యంగా ఏది పడితే అది తింటాను అంటే కుదరదని రామకృష్ణ అంటున్నారు. మంచి ఆహారం అనేది రోగం ఉన్నా లేకపోయినా అందరూ తినాల్సిందేనని.. జబ్బులు తెచ్చుకుని డైట్ పాటించేకన్నా మంచి ఆహారం తీసుకుంటూ జబ్బులకు మనల్ని మనం దూరంగా ఉంచుకోవమే మిన్న అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.