EXCLUSIVE: పొట్ట ఇలా ఉంటే గుండెపోటు రిస్క్ ఎక్కువే..!
EXCLUSIVE: పొట్ట ఎక్కువగా ఉన్నవారిని చూసి కొవ్వు ఎక్కువగా ఉంది గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కొందరు వైద్యులు పేషెంట్లను చూడగానే అంచనాలు వేసేస్తుంటారు. అయితే పొట్ట దగ్గర కొవ్వు పెరగడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఎలాంటి పొట్ట ఉన్నవారికి గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందో క్లియర్గా వివరించారు ప్రముఖ వైద్య నిపుణులు వీరమాచినేని రామకృష్ణ (veeramachineni ramakrishna).
పొట్ట అంటే పై ఫోటోలో చూపిస్తున్నట్లు కిందకి వేలాడుతూ ఉందనుకోండి.. అది కచ్చితంగా హానికరమే అని రామకృష్ణ అంటున్నారు. అంతకంటే పెద్ద రిస్క్ పొట్ట ఛాతి కింద నుంచి ఉబ్బినట్లుగా ఉండటం. అంటే పొట్ట కిందకు వేలాడకుండా.. పై భాగంలోనే ఉబ్బినట్లుగా ఉంటుంది. ఇలాంటివారికి గుండెపోటు వచ్చే రిస్క్ 100 శాతం ఎక్కువగా ఉంటుంది.
పొట్ట ఇలా ఉంటే చిన్న వయసు వారికి కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. చక్కని జీవన శైలి, బయటి ఆహారాలకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా కార్డియో, వ్యాయామం చేయడం. వీటితో పాటు ప్రతి సంవత్సరానికి ఒకసారి శరీరమంతా వైద్య పరీక్షలు చేయించుకోవడం.