Low Blood Vs High Blood Sugar: ఏది ప్రమాదకరం?
Low Blood Vs High Blood Sugar: బ్లడ్ షుగర్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హై బ్లడ్ షుగర్ మరొకటి లో బ్లడ్ షుగర్. హై బ్లడ్ షుగర్ని హైపో గ్లైసీమియా, లో బ్లడ్ షుగర్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఈ రెండింటికీ తేడా ఏంటి? ఏది ప్రమాదకరం? వంటి అంశాలను తెలుసుకుందాం.
హైపో గ్లైసీమియా అంటే ఒంట్లో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు లెక్క. హైపర్ గ్లైసీమియా అంటే తక్కువ ఉన్నట్లు. ఈ రెండింట్లో ఏది వచ్చినా ప్రమాదకరమే అని వైద్యులు చెప్తున్నారు. హైపో గ్లైసీమియాలో షుగర్ స్థాయిలో 60 నుంచి 40కి 40 నుంచి 20కి పడిపోతూ ఉంటాయి. ఇలాంటి వారిలో ఫిట్స్ రావడం, కోమాలోకి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని సార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. హైపర్ గ్లైసీమియా అంటే టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉంటుంది. (Low Blood Vs High Blood Sugar)
హైపో గ్లైసీమియా ఎవరికి వస్తుంది?
మన ఒంట్లో షుగర్ స్థాయిలు 90 వరకు ఉంటే అది 90 నుంచి కిందకి వెళ్లకూడదు. ఒకవేళ కిందకి వెళ్లిందంటే మనిషి బతికే ఛాన్సులు కూడా తక్కువే ఉంటాయి. టైప్ 1 టైప్ 2 ముదిరిపోయిన డయాబెటిస్ ఉన్నవారికి ఈ హైపో గ్లైసీమియా వచ్చే అవకాశం ఉంటుంది.
హైపర్ గ్లైసీమియా అంటే ఏంటి?
ఇందులో పూర్తిగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ హైపర్ గ్లైసీమియా రాదు. ఇది డయాబెటిస్ లేనివారికి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ హైపర్ గ్లైసీమియా వచ్చే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ హైపర్ గ్లైసీమియాతో హాస్పిటల్ పాలయ్యేవారిలో 12 శాతం మంది అసలు డయాబెటిస్ లేనివారే చేరుతున్నారట. (Low Blood Vs High Blood Sugar)
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఈ హైపో, హైపర్ గ్లైసీమియాలు ఒంటికి హాని కలిగించేవే. అయితే.. శరీరంలో చెక్కర స్థాయిలు ఎక్కువగా ఉన్నా కంగారుపడాల్సిన అవసరం లేదు. అంటే ఇది వెంటనే మనిషికి హాని తలపెట్టదు. కానీ ఎప్పుడైతే షుగర్ స్థాయిలు అంతకంతకూ పడిపోతూ వస్తాయో వారికి చాలా ప్రమాదకరం.
దీని గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకున్నప్పుడు వైద్యులను దీని గురించి క్లియర్గా అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకు మందులు ఇస్తుంటే అవి ఎందుకు ఏంటి అని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు కదా..! (Low Blood Vs High Blood Sugar)