Turmeric: మితిమీరితే విష‌పూరిత‌మే

Turmeric:  ప‌సుపులో ఉండే పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర జ‌బ్బుల‌ను నిరోధించే శ‌క్తి ప‌సుపుకు ఉంది. అయితే దీనిని ఎక్కువ‌గా వాడితే మాత్రం విష‌పూరిత‌మేన‌ని హెచ్చ‌రిస్తున్నారు వైద్యులు.

ప‌సుపులో లాభాలు ఎక్కువ‌గా ఉంటాయి క‌దా అని ఎక్కువగా తీసుకుంటే లాభాలు రెట్టింపు అవ్వ‌వు అనే విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పిత్త దోషం ఉన్న‌వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డేవారు ప‌సుపును ఆచి తూచి వాడాలి. వేస‌వి కాలంలో ప‌సుపు వాడ‌కాన్ని కాస్త త‌గ్గిస్తే మంచిది. ఎందుకంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి.

ప‌సుపు ప‌చ్చిగా ఉన్న‌దానినే నూరుకుని వాడుకోవ‌డం బెట‌ర్. ప‌సుపు రంగు ఎంత ప‌చ్చ‌గా ఉంటే అంత స్వ‌చ్ఛ‌మైన‌ద‌ని అర్థం. అండ‌ర్ వెయిట్ ఉన్న‌వారు, మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డేవారు, పొడి చ‌ర్మం ఉన్న‌వారు ప‌సుపును వాడ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం. ఒక‌వేళ వాడాల‌నుకుంటే ఏ2 నెయ్యి, ఏ2 కొవ్వు ఉన్న పాల‌తో తీసుకుంటే మంచిది.