Ghee Coffee: దీని లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు
Ghee Coffee: ఉదయాన్నే కాఫీ, టీలు అందరూ తాగుతారు. కానీ నెయ్యితో తయారుచేసిన కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ నెయ్యి కాఫీ లాభాలు తెలిస్తే కచ్చితంగా వదిలిపెట్టరు.
కాఫీలో నెయ్యి అనగానే ఛీ.. అనేస్తుంటారు. నిజానికి ఈ నెయ్యి కాఫీని కీటో డైట్‌లో వాడుతుంటారు. ఈ నెయ్యి కాఫీలో పాలు ఉండవు. కేవలం బ్ల్యాక్ కాఫీ నెయ్యి మాత్రమే ఉంటుంది. సాధారణ బ్ల్యాక్ కాఫీలో కంటే నెయ్యి కాఫీలో ఉండే పోషకాలు ఎక్కువే. ఉదయాన్నే ఒక కప్పు నెయ్యి కాఫీ తాగితే మానసికంగా క్లారిటీ ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
మరిన్ని లాభాలు
*షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది.
*కాఫీ తాగితే ఎసిడిటీ వస్తుంది అనుకునేవారు ఈ నెయ్యి కాఫీని తాగచ్చు. నెయ్యి కాఫీలోని ఎసిడిటీని పీల్చేసుకుంటుంది.
*నెయ్యిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ అయిన బ్యూటిరేట్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అదే కేవలం పాలతో తయారుచేసిన కాఫీ తాగితే ఎసిడిటీ పెరిగిపోయి కడుపు మండిపోతుంది.
*ఇందులో ఒమేగా 3s, 6s, 9s ఉంటాయి కాబట్టి మెటబాలిజంని పెంచుతుంది. గుండె కండరాలు పదిలంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా మారతాయి. మేధో శక్తి పెరుగుతుంది.
*నెయ్యి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కడుపు నిండినట్లు ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినలేరు. ఫలితంగా బరువు తగ్గడంలో సాయపడుతుంది.
*నెయ్యి కాఫీ తాగడం వల్ల మీ శరీరం లోపలి నుంచి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఈ నెయ్యి కాఫీ తాగడం వల్ల కాస్త సాంత్వన పొందుతారట.