Sports Hernia బారిన ప‌డిన సూర్య కుమార్ యాద‌వ్.. అస‌లేంటీ వ్యాధి?

Sports Hernia: ప్ర‌ముఖ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ (surya kumar yadav) హెర్నియా బారిన ప‌డ్డారు. ఇది మామూలు హెర్నియా కాదు. స్పోర్ట్స్ హెర్నియా. అస‌లు ఏంటీ స్పోర్ట్స్ హెర్నియా? ఎవ‌రికి వ‌స్తుంది? ఎలా నివారించుకోవాలి వంటి అంశాల‌ను తెలుసుకుందాం.

స్పోర్ట్స్ హెర్నియాను అథ్లెటిక్ పుబ‌ల్జియా అని కూడా అంటారు. మ‌గ‌వారికి అంగం వ‌ద్ద ఉండే క‌ణ‌జాలానికి ఏద‌న్నా గాయం అయితే ఈ స్పోర్ట్స్ హెర్నియా వ‌స్తుంది. సాధార‌ణ హెర్నియా కేసుల్లో క‌డుపులో ఎక్క‌డైనా రంధ్రం వంటివి ఏర్ప‌డుతుంటాయి. కానీ ఈ స్పోర్ట్స్ హెర్నియా కేసుల్లో అంగం వ‌ద్ద ఉండే క‌ణజాలాలు, కండ‌రాలు దెబ్బ‌తింటాయి.

ఎక్కువ‌గా ఈ ర‌క‌మైన హెర్నియా క్రీడాకారుల‌కు మాత్ర‌మే వ‌స్తుంది. ఒక‌వేళ స్పోర్ట్స్ హెర్నియా ఉంద‌ని తేలితే కొన్ని కేసుల్లో స‌ర్జ‌రీ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. సూర్య కుమార్‌కు జ‌ర్మ‌నీలోని మ్యూనిక్‌లో స‌ర్జ‌రీ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. స‌ర్జ‌రీ అవ‌స‌రం లేక‌పోతే యాంటీ ఇన్‌ఫ్ల‌మేటరీ మందుల‌ను వైద్యులు సూచిస్తారు.

ఇంత‌కీ ఈ స్పోర్ట్స్ హెర్నియా ఎప్పుడు వ‌స్తుందంటే.. క్రీడాకారులు త‌మ శ‌రీరాన్ని దాదాపు అన్ని యాంగిల్స్‌లో స్ట్రెచ్ చేస్తూ ఉంటారు. ఆ స‌మయంలో క‌ణ‌జాలంలో మార్పులు క‌ద‌లిక‌లు ఏర్ప‌డి ఈ హెర్నియా వస్తుంది.